తొలి సినిమాతోనే ఓవర్‌నైట్‌ స్టార్‌డం

6 Apr, 2021 15:11 IST|Sakshi

ఎంతోమంది స్టార్‌ హీరోయిన్‌ అవ్వాలని  ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు..కానీ ఆ అదృష్టం కొందరికే కలిసొస్తుంది. మొదటి సినిమాతోనే కొందరు కనుమరుగైతే, మరొకందరు మాత్రం ఓవర్‌ నైట్‌ స్టార్‌ హీరోయిన్లుగా మారుతున్నారు. నటన, అందం సహా అదృష్టం కూడా కలిసొచ్చి మొదటి సినిమాతోనే స్టార్‌డంను సందించుకుంటున్నారు. అలా టాలీవుడ్‌లో డెబ్యూ మూవీతోనే స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి ఎదిగిన హీరోయున్లు ఎవరో చూద్దాం. 

కృతిశెట్టి..మొదటి సినిమాతోనే బంపర్‌ హిట్‌ అందుకున్న ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఉప్పెనతో బేబమ్మగా అలరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. చూడచక్కని అందంతో కుర్రాల మతులు పోగొడుతుంది ఈ మంగళూరు బ్యూటీ.

ఛలో సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌ రష్మిక మందన్నా. ఈ సినిమా హిట్‌ కావడంతో ఈ అమ్మడికి స్టార్స్‌తో జతకట్టే అవకాశాలు వచ్చాయి. దీంతో అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఇటు తెలుగు, కన్నడ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఏకంగా అమితాబ్‌ బచ్చన్‌ సినిమాలోనే అవకాశం దక్కించుకొని మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్‌గా నిలిచింది. 

ఆర్‌ఎక్స్‌100 సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టిన హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌. సాధారణంగా బోల్డ్‌ కంటెంట్‌తో డెబ్యూగా రావడంటే సాహసమనే చెప్పాలి. అలాంటి ధైర్యమే చేసింది ఈ పంజాబీ భామ. వచ్చీ రావడమే సూపర్‌ హిట్‌ అందుకొని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మొదటి సినిమాతోనే బంపర్‌ హిట్‌ అందుకొని టాలీవుడ్‌లో దూసుకుపోతుంది. సినిమాలతో పాటు హాట్‌ ఫోటో షూట్‌లతో టాక్‌ ఆఫ్‌ ది టైన్‌గా హైలెట్‌ అవుతోంది ఈ ముద్దుగుమ్మ.

నాగ చైతన్య హీరోగా గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఏ మాయ చేసావే. ఈ సినిమాతో సమంత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సూపర్‌హిట్‌ అందుకొని స్టార్‌ హీరోయిన్‌ అయ్యింది. డెబ్యూ మూవీతోనే తన ఫర్మార్మెన్స్‌ ఏంటో రుజువు చేసింది ఈ చెన్నై చిన్నది. ఏ మాయ చేసిందో గానీ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలకు సమానంగా అవకాశాలు దక్కించుకుంది. తొలి సినిమాలో నటించిన నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. 

అర్జున్‌రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌ డం సందించుకున్న హీరో-హీరోయిన్లు విజయ్‌ దేవరకొండ, షాలినీ పాండే. ఈ ఒక్కసినిమాతో విజయ్‌ దేవరకొండ పాన్‌ఇండియా లెవల్‌లో ఫ్యాన్స్‌ని సంపాదించుకుంటే, షాలినీ పాండేకి మంచి గుర్తింపు దక్కింది. డెబ్యూ హీరోయిన్‌గా షాలినీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే అనుకున్నంతగా ఆమెకు అవకాశాలు రాలేదు. దీంతో ప్రస్తుతం వర్కవుట్లు చేస్తూ స్లిమ్‌గా తయ్యారయ్యింది.

నితిన్‌ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమా జయం. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది సదా. ఈ మూవీ ఎంత పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అయ్యిందో వేరే చెప్పక్కర్లేదు. తొలి సినిమాతోనే బంపర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకొని సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది ఈ చిన్నది. జయం అనంతరం టాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకొని కొన్నేళ్ల పాటు స్టార్‌ హీరోయిన్‌గా చలామణి అయ్యింది. 

అ‍ల్లు అర్జున్‌-పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం దేశముదురు. ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన భామ హన్సిక. డెబ్యూ మూవీతోనే స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది హన్సిక. తొలి సినిమాతోనే అందంతో క్రుర్రాల మతులు పొగొట్టింది ఈ బ్యూటీ. అంతేకాకుండా దేశ ముదురు చేసే సమయానికి హన్సిక టెన్త్‌ క్లాస్‌. దీంతో షూటింగ్‌లో పాల్గొంటూనే ఎగ్జామ్స్‌ రాసింది. 

ఉదయ్‌కిరణ్‌, రీమా సేన్‌ చిత్రం మూవీతో జంటగా నటించారు. ఈ సినిమా అప్పట్లోనే ఎంత పెద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యిందో వేరే చెప్పక్కర్లేదు. తొలి సినిమాతోనే రీమాసేన్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిపోయిది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు దక్కించుకొని ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. 

మరిన్ని వార్తలు