ప్రకాశ్‌ రాజ్‌, జగపతిబాబు ‌రెమ్యునరేషన్‌ తెలిస్తే షాకవ్వాల్సిందే‌

11 Apr, 2021 16:55 IST|Sakshi

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోతోపాటు విలన్స్ కూడా క్రేజ్ పెరిగిపోతుంది. హీరో ఎంత బలంగా ఉంటాడో… అతని ప్రత్యర్థి కూడా అంతే బలమైన నాయకుడే అయి ఉండాలి. అప్పుడే హీరోయిజం అంతగా పవర్‌ఫుల్‌ అవుతుంది. అప్పుడే సినిమాపై ప్రేక్షకుడికి ఆసక్తి పెరుగుతుంది. ఈ సూత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి, బోయపాటి శ్రీను, కృష్ణవంశి లాంటి దర్శకులు పక్కాగా ఫాలో అవుతారు. తమ సినిమాల్లో హీరోకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. విలన్‌కు కూడా అంతే ఉండేలా జాగ్రత్తపడతారు. హీరోకి తగిన విలన్‌ క్యారెక్టర్‌ని సృష్టిస్తారు. అందుకే టాలీవుడ్‌లో ప్రస్తుతం విలన్‌కు మంచి డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ఒకప్పటి స్టార్‌ హీరోలు సైతం నెగెటివ్‌ పాత్రలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అదే స్థాయిలో రెమ్యునరేషన్‌ కూడా తీసుకుంటున్నారు. టాలీవుడ్‌లో టాప్‌ విలన్స్‌ రెమ్యునరేషన్‌ గురించి తెలుసుకుందాం. 

మంచి తండ్రి, చెడ్డ మొగుడు, రౌడీ పోలీసు, ప్రేమికుడు, విలన్, స్నేహితుడు, తాత ఇలా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలో ఒదిగిపోయే ఏకైక నటుడు ప్రకాశ్‌ రాజ్‌.. తన నటనతో ఆ పాత్రకు జీవం పోస్తాడు. కృష్ణవంశి దర్శకత్వంలో వచ్చిన అంతపురం సినిమాలో త‌న న‌ట‌న‌తో ప్ర‌కాష్ రాజ్ విల‌న్ గా ఒక్క‌సారిగా హైలెట్ అయ్యాడు. అప్ప‌టి నుంచి విల‌న్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కొన‌సాగుతున్నాడు. ఆయన విలన్‌ పాత్రకు అయితే దాదాపు కోటిన్నర వరకు తీసుకుంటారని సమాచారం. అదే సపోర్టింగ్‌ క్యారెక్టర్‌కు అయితే దాదాపు 10 లక్షల రూపాయలను రెమ్యునరేషన్‌గా పుచ్చుకుంటాడట.

ఒకప్పుడు ప్యామిలీ హీరోగా రాణించిన జగపతిబాబుని విలన్‌గా మార్చాడు దర్శకుడు బోయపాటి శ్రీను. బాలయ్య ‘లెజెండ్’ సినిమాతో విలన్‌గా జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ఇక అప్పటి నుంచి జగపతిబాబుకు వరసపెట్టి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన దక్షిణాదిలోనే ది బెస్ట్ విలన్‌గా కొనసాగుతున్నారు. ఈయన ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 


హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్న సాయికుమార్‌..రామ్‌చరణ్‌ ‘ఎవడు’సినిమాతో విలన్‌గా మారాడు. ఆ సినిమాలో సాయికుమార్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం సాయికుమార్‌ ఒక్కో సినిమాకు రూ.50లక్షలు తీసుకుంటున్నాడట.

అరుంధతి సినిమాతో టాలీవుడ్‌లో టాప్‌ విలన్‌ లిస్ట్‌లో చేరాడు సోనూసూద్‌. విలన్‌గా భయపెడుతూనే అప్పుడప్పుడు నవ్విస్తాడు కూడా. ఈ యంగ్‌ విలన్‌ ఒక్కో సినిమాకు రూ.80లక్షల నుంచి కోటి వరకు పుచ్చుకుంటాడట.

రాజమౌళి ‘ఈగ’సినిమాతో విలన్‌గా మారాడు కన్నడ స్టార్‌ హీరో సుదీప్‌. ఈ సినిమాతో టాలీవుడ్‌లో సుదీప్‌కు మంచి మార్కెట్‌ ఏర్పడింది. ఆయన నటించిన కన్నడ సినిమాలు కూడా ఇక్కడ విడుదలయ్యాయి. అలాగే దబాంగ్‌-3లో కూడా విలన్‌గా నటించాడు. ఈ స్టైలీష్‌ విలన్‌ ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల వరకు తీసుకంటాడని టాక్‌.

రామ్ చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన వినేయ విధేయ రామలో పవర్‌పుల్‌ విలన్‌ పాత్ర చేశాడు వివేక్ ఒబేరాయ్. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడినా.. వివేవ్‌కి మంచి పేరుతెచ్చింది. ఆయన ఒక్కో సినిమాకు రూ.3 కోట్లను రెమ్యునరేషన్‌గా తీసుకుంటాడట.


 కొరటాల శివ దర్శకత్వం వహించిన  మిర్చి చిత్రంలో పవర్ ఫుల్  విలన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు సంపత్ రాజ్. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అన్ని సినిమాల్లోలో విలన్‌గా నటిస్తూ దూసుకెళ్తున్నాడు. ఈయన ఒక్కో సినిమాకు రూ.60లక్షల నుంచి 70లక్షల వరకు తీసుకుంటాడని సమాచారం.

స్టైలీష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమాతో విల‌న్ గా ఎంట్రీ ఇచ్చాడు ర‌వి కిష‌న్. తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘సైరా’లో కూడా మంచి పాత్ర లభించింది. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు 50 లక్షలు తీసుకుంటాడని సమాచారం. వీరితో పాటు ఒకవైపు హీరోగా రాణిస్తూనే విలన్‌ రోల్స్‌ చేస్తున్న ఆది పినిశెట్టి రూ.కోటి, కోలీవుడ్‌ సినిమాల్లో విలన్‌గా రాణిస్తున్న హరీష్‌ రూ.50లక్షలుగా రెమ్యునరేషన్‌ అందుకుంటున్నారట.


చదవండి :
రాజమౌళి, సుకుమార్‌, త్రివిక్రమ్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

మరిన్ని వార్తలు