ఓటీటీలో పాన్‌ ఇండియా సినిమాల సందడి.. మేలో ఎన్ని చిత్రాలంటే..

5 May, 2022 14:10 IST|Sakshi

List Of Upcoming OTT Movies In May 2022: మొన్నటి వరకు థియేటర్స్‌లో సందడి చేసిన పాన్‌ ఇండియా చిత్రాలు.. ఇప్పుడు ఓటీటీలో హల్‌చల్‌ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి కేజీయఫ్‌ 2 వరకు అన్ని సినిమాలు మేలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుండటంతో నెటిజన్స్‌లో నయా జోష్‌ మొదలైంది. ముందుగా మే 11న బీస్ట్‌ మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. విజయ్‌, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఏప్రిల్‌ 13న థియేటర్స్‌లో విడుదలైంది.

ఓ షాపింగ్‌ మాల్‌లోకి కొంతమంది ఉగ్రవాదులు చొరబడి ప్రజలను బందీలుగా మారుస్తారు. ఉగ్రవాదుల చెర నుంచి ప్రజలను హీరో ఏ విధంగా రక్షించాడు అనేదే బీస్ట్‌ కథ. ఈ చిత్రానికి తొలిరోజు నుంచే మిశ్రమ స్పందన రావడం, తరువాతి రోజు(ఏప్రిల్‌ 14) కేజీయఫ్‌2 విడుదల కావడంతో బాక్సాఫీస్‌ వద్ద బీస్ట్‌ బోల్తాపడింది. దీంతో అనుకున్నదానికి కంటే ముందే ఓటీటీలో విడుదల చేస్తున్నారు మేకర్స్‌. మే 11న సన్‌ నెక్స్ట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో బీస్ట్‌ ప్రసారం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఇక మే 13న  2022 బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ ది కశ్మీర్ ఫైల్స్ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీ రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్‌ ఖేర్‌, మిథున్‌ చక్రవర్తి, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్‌ వద్ద చరిత్ర సృష్టించిన ఈ చిత్రం ఓటీటీలో ఎన్ని రికార్డులను క్రియేట్‌ చేస్తుందో చూడాలి

ఇక మే20న మరో పాన్‌ఇండియా  బ్లాక్ బస్టర్ ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలో విడుదల కానుంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్‌గా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 25న థియేటర్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టింది. జూన్‌ 3న ఈ సినిమా ఓటీటీలో రిలీజ్‌ అవుతుందని మొదట వార్తలు వచ్చాయి. కానీ, ఈ తాజా బజ్‌ ప్రకారం మే 20 నుంచే  జీ అండ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందట. తొలుత ఈ చిత్రాన్ని పే ఫర్ వ్యూ పద్దతిలో విడుదల చేసేందుకు ఈ రెండు ఓటీటీ సంస్థలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జూన్ 3నుంచి మాత్రం సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులో ఉందనుంది.

ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటు మరో పాన్‌ ఇండియా చిత్రం కూడా మే నెలలోనే ఓటీటీలోకి రానుంది. మే 27న అమెజాన్ ప్రైమ్ లో కేజీయఫ్ 2 విడుదల కానుందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ విషయం పై క్లారిటీ రానుంది.యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను సృష్టించింది. ఇప్పటికీ ఈ చిత్రానికి థియేటర్స్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఒకవేళ నిజంగానే మే 27న ఓటీటీలోకి కేజీయఫ్‌ 2 వస్తే.. రాకీభాయ్‌ ఫ్యాన్స్‌కు పండగే. 

(చదవండి: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఆహా, మేలో ఏకంగా 40+ మూవీస్‌!)

మరో వైపు ఆచార్య ఓటీటీ రిలీజ్ పై కూడా రూమర్స్ మొదలయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర ఆచార్యకు ఆశించినంత ఆదరణలేకపోవడంతో కాస్త ముందుగానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఎర్లీ ప్రీమియర్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ ఆచార్య ప్రొడ్యూసర్స్ తో 18 కోట్లకు డీల్ కుదుర్చుకుందని సమాచారం.

మరిన్ని వార్తలు