OTT, Theatre Releases This Week: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే

30 Aug, 2022 15:26 IST|Sakshi

తెలుగు సినీ పరిశ్రమకు ఆగస్ట్‌ నెల మిశ్రమ ఫలితాన్ని అందించింది. గత కొన్ని రోజులుగా వరుస డిజాస్టర్స్‌తో సతమతమవుతున్న ఇండస్ట్రీకి బింబిసార, సీతారామం, కార్తికేయ 2 చిత్రాలు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ని అందించి కొత్త ఆశలు రేకెత్తించాయి. అదే ఉత్సాహంతో విడుదలైన కొన్ని చిత్రాలు నిరుత్సాహపరిచాయి. ఇక ఈ వారం.. అంటె సెప్టెంబర్‌ నెలారంభంలో  అటు థియేటర్‌లో ఇటు ఓటీటీలో అలరించడానికి పలు చిన్న చిత్రాలు విడుదలయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. 

కోబ్రా
తమిళ స్టార్‌ చియాన్ విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కోబ్రా’.  వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు ఈ  యాక్షన్ థ్రిల్లర్‌కు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో  శ్రీనిధి శెట్టి  హీరోయిన్‌గా నటించగా.. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విలన్‌ పాత్ర పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వినాయక చవితి కానుకగా ఆగస్ట్ 31న థియేటర్స్‌లో విడుదల కానుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదలౌతుంది. 


రంగరంగ వైభవంగా
మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ నటించిన లెటెస్ట్‌ చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి గిరీశాయ దర్శకత్వం వహించారు.బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న రిలీజ్‌ కానుంది.

ఫస్ట్‌డే ఫస్ట్‌ షో
జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న చిత్రం ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ సినిమాకు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్ టైన్మెంట్ బేనర్ లో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


బుజ్జీ..ఇలారా..
సునీల్, ధన్‌రాజ్‌ హీరోలుగా ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బుజ్జీ.. ఇలారా’. చాందినీ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. రూపా జగదీశ్‌ సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెస్టెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’
తేజ్‌ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటించిన చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. వెంకట్‌వందెల దర్శకుడు. ముల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరావు  నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదల కానుంది.

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు

అమెజాన్ ప్రైమ్
ద లార్డ్ ఆఫ్ రింగ్స్(వెబ్ సిరీస్ తెలుగు), సెప్టెంబర్ 2 విడుదల

ఆహా
పంచతంత్ర కథలు (తెలుగు), ఆగస్ట్ 31 

పెళ్లి కూతురు పార్టీ (తెలుగు),  ఆగస్ట్ 31

డిస్నీ ప్లస్ హాట్ స్టార్
కఠ్‏పుత్లీ(హిందీ), సెప్టెంబర్ 2
ఖుదా హఫీజ్ 2(హిందీ), సెప్టెంబర్ 2

సోనీలీవ్‌
సుందరి గార్డెన్స్‌(మలయాళం), సెప్టెంబర్‌ 03

జీ5
విక్రాంత్‌ రోణ(తెలుగు), సెప్టెంబర్‌ 2

నెట్‌ఫ్లిక్స్‌
 ఐ కేమ్ బై (ఒరిజినల్ మూవీ), ఆగస్ట్ 31 
ఫ్యామిలీ సీక్రెట్స్(వెబ్ సిరీస్), ఆగస్ట్ 31 
అండర్ హర్ కంట్రోల్(ఒరిజినల్ మూవీ), ఆగస్ట్ 31

మరిన్ని వార్తలు