Theatres/OTT: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..

18 Jul, 2022 15:06 IST|Sakshi

ప్రతివారం బాక్సాఫీసు వద్ద కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అయితే సమ్మర్‌లో పెద్ద సినిమాలు, పాన్‌ ఇండియా చిత్రాలు సందడి చేయగా.. ఇప్పుడు చిన్న సినిమాలు వరుసగా థియేటర్లోకి వస్తున్నాయి. ఇక బిగ్‌స్క్రీన్‌పై వచ్చిన పలు పెద్ద సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. అలా ఈ వారం థియేటర్లో, ఓటీటీలో సందడి చేసే చిత్రాలేంటో చూద్దాం రండి!

ఈ వారం థియేటర్లో సందడి చేసే చిత్రాలివే:

‘థ్యాంక్యూ’ చేప్పేందుకు వస్తున్న నాగ చైతన్య
అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్‌ యూ'. రాశీ ఖన్నా, మాళవికా నాయర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చై విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. దిల్‌ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అనసూయా ‘దర్జా’
సునీల్‌, అనసూయ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్‌ సమర్పణలో పీఎస్‌ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సలీమ్‌ మాలిక్‌ దర్శకత్వంలో శివశంకర్‌ పైడిపాటి నిర్మించారు. ఈ నెల 22న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

‘షంషేరా’గా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న రణ్‌బీర్‌
కరణ్‌ మల్హోత్రా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్, వాణీ కపూర్‌ జంటగా సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘షంషేరా’. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న హిందీ, తెలుగు భాషల్లో విడుదలవుతోంది.

‘మహ’గా వస్తున్న హన్సిక
హీరోయిన్‌ ఓరియంటెడ్‌ పాత్రంలో హన్సిక నటించిన తొలి చిత్రం మహా. మదియళగన్‌ ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ, మాలిక్‌ స్ట్రీమింగ్‌ కార్పొరేషన్‌ అధినేత డత్తో అబ్దుల్‌ మాలిక్‌ నిర్మించిన ఈ చిత్రానికి జమీల్‌ దర్శకుడు. శింబు కీలక పాత్ర పోషిస్తుండగా శ్రీకాంత్, కరుణాకరన్, తంబి రామయ్య ముఖ్యపాత్రలు పోషించారు. జిబ్రాన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం జూలై 22వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.

‘హై ఫైవ్‌’
అమ్మ రాజశేఖర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం 'హై ఫైవ్‌'. మన్నార చోప్రా, సుధీర్‌, అమ్మ రాజశేఖర్‌, సమీర్‌ తదితరులు నటించిన ఈ చిత్రం జూలై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించాడు.

మీలో ఒకడు 
శ్రీమ‌తి చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ''మీలో ఒకడు''. సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ కీల‌క పాత్రలో న‌టిస్తున్నారు. న‌టులు కృష్ణ భ‌గ‌వాన్, స‌మీర్, అశోక్ కుమార్, బ‌స్టాప్ కోటేశ్వర‌రావు, గ‌బ్బర్ సింగ్ బ్యాచ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం జూలై 22న థియేటర్లోకి రాబోతోంది. 

జగన్నాటకం
మనిషి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘జగన్నా టకం’. ఆరజ్‌ అల్తాడ దర్శకత్వంలో పార్వతీశం, కుమారస్వామి, స్వాతి మండల్‌ అర్ఫితా లోహి ప్రధానా పాత్రలు పోషించారు. ఈ మూవీ జులై 22 ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. వి. కిరణ్‌ కుమార్‌ ఈ సినిమాకు సంగీతం అందించాడు. 

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటంటే...

ట్రిబుల్‌ ఫన్‌తో వస్తున్న ‘ఎఫ్‌ 3’
అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటించిన చిత్రం ఎఫ్‌3. తమన్నా, మెహరీన్‌, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్లుగా నటించగా, రాజేంద్రప్రసాద్‌, మురళీ శర్మ, అలీ, సునీల్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు.  ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం జూలై 22న ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌, సోనిలివ్‌లో ఈ చిత్రం జూలై 22న నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. 

నెట్‌ఫ్లిక్స్‌
ఇండియన్‌ ప్రిడెటర్‌ హిందీ సిరీస్‌ - జూలై 20 
ద గ్రే మ్యాన్‌(తెలుగు డబ్బింగ్‌) - జూలై 22
యూత్‌ ఆఫ్‌ మే (కొరియన్‌ సిరీస్‌) - జూలై 22

అమెజాన్‌ ప్రైం
కమెండెడ్‌ ఫర్‌ యూ షార్ట్‌ఫిల్మ్‌ విడుదల - జూలై 20

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌
పరంపర 2 తెలుగు సిరీస్‌ జూలై 21న హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 

ఆహా
తొలి తెలుగు ఓటీటీలో బిగ్‌బాస్‌ ఫేం షణ్ముక్‌ జశ్వంత్‌ ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌ తెలుగు సిరీస్‌ జూలై 22న విడుదల కానుంది. 

సోనీ లివ్‌
డాక్టర్‌ అరోరా(హిందీ సిరీస్‌) - జూలై 22
మీమ్‌ బాయ్స్‌ (తమిళ సిరీస్‌) - జూలై 22
ఎఫ్‌ 2 మూవీ - జూలై 22

మరిన్ని వార్తలు