RIP Michael: లిటిల్‌ ఒమర్‌ నటుడు.. డ్రగ్స్‌ ఓవర్‌డోస్‌తోనే చనిపోయాడా?

7 Sep, 2021 08:55 IST|Sakshi

Michael K. Williams Death News: డ్రగ్స్‌ మత్తు మరో మంచి నటుడిని బలి తీసుకుంది!. హాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మికాయిల్‌ కెన్నెత్‌ విలియమ్స్‌(54) డ్రగ్స్‌కు బానిసై కన్నుమూశాడు. హెచ్‌బీవో బ్లాక్‌బస్టర్‌ డ్రామా ‘ది వైర్‌’లో ఒమర్‌ లిటిల్‌ క్యారెక్టర్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు మికాయిల్‌ కె విలియమ్స్‌. బ్రూక్లిన్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటున్న ఆయన మృతిని..  సోమవారం మధ్యాహ్నం పోలీసులు ప్రకటించారు. 


దశాబ్దాలుగా టీవీ ఆడియొన్స్‌ను అలరించిన మికాయిల్‌ కె విలియమ్స్‌.. ఐదుసార్లు ప్రైమ్‌టైం ఎమ్మీ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. 2021లోనూ ‘లవ్‌క్రాఫ్ట్‌ కంట్రీ’కి ఎమ్మీ నామినేషన్‌ దక్కించుకున్నారాయన. రెండురోజులుగా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో దగ్గరి బంధువు ఒకరు సోమవారం మైకేల్‌ ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూశారు. అక్కడ డ్రగ్స్‌ ప్యాకెట్స్‌ మధ్య విలియమ్స్‌ మృతదేహాంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు ఆ బంధువు. డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌ వల్లే మికాయిల్‌ చనిపోయినట్లు ప్రాథమిక పరీక్షల్లో నిర్దారణ అయ్యింది.
  

డ్రగ్స్‌ నుంచి బయటపడలేక.. 
ఒమర్‌ లిటిల్‌ క్యారెక్టర్‌తో ఆడియొన్స్‌కు బాగా గుర్తుండిపోయిన మికాయిల్‌ కె విలియమ్స్‌.. భార్య చనిపోయాక కొడుకుతో ఉంటున్నారు. అయితే కొన్ని నెలలుగా ఆయన డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన ఒంటరిగా ఉంటున్నాడు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ అలవాటు గురించి ప్రస్తావించి.. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారాయన.

బుల్లెట్‌లో మికాయిల్‌(కుడి చివర)

1966 నవంబర్‌లో బ్రూక్లిన్‌లో పుట్టిన మికాయిల్‌ విలియమ్స్‌.. 22 ఏళ్లకు ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలోకి అడుగుపెట్టాడు. సుమారు 50కిపైగా మ్యూజిక్‌ వీడియోలు చేశారు. 1996లో ‘బుల్లెట్‌’ మూవీ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టి.. ఓవైపు సినిమాలు, మరోవైపు బుల్లితెరపైనా రాణించారు. మార్టిన్‌ స్కొర్‌సెజే డైరెక్షన్‌లోనూ.. ‘చాకీ, బ్రాడ్‌వాక్‌ ఎంపైర్‌, బెస్సీ, 12 ఇయర్స్‌ ఏ స్లేవ్‌’ లాంటి సినిమాల్లో నటనతోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారాయన. అయితే మికాయిల్‌కు గ్లోబల్‌ వైడ్‌గా గుర్తింపు దక్కింది మాత్రం ఒమర్‌ లిటిల్‌ క్యారెక్టర్‌తోనే.

చదవండి: అబ్బాయి నుంచి అమ్మాయిగా..

మరిన్ని వార్తలు