మూఢ నమ్మకాల వల్ల జరిగే అనర్థాల నేపథ్యంలో ‘లాకెట్‌’

25 Jun, 2022 14:12 IST|Sakshi

అనిల్, విభీష హీరోహీరొయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘లాకెట్‌’. ఫణికుమార్‌ అద్దేపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ పటేల్  సమర్పణలో ఇంద్రకంటి మురళీధర్  అఖిల్ విజన్ మూవీస్ బ్యానర్ ద్వారా నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ప్రదర్శన హైదరాబాద్‌లోని  ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. సమాజంలో పెరుగుతున్న మూఢనమ్మకాల పై  వాటి  వల్ల జరిగే  అనర్దాలపై ఈ చిత్రం లో  వివరించడం జరిగింది. ఈ చిత్రం విడుదలకు  సిద్ధమైన సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈ చిత్ర సమర్పకులు మహేష్ పటేల్ తో పాటు శివలాల్ పటేల్, చందూలాల్ పటేల్, భరత్ పటేల్, చమన్ పటేల్, ఘనశ్యం పటేల్, ప్రముఖ పారిశ్రామిక వేత్త  రాజు అతిధులుగా  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్స్ సీఈవో రాజీవ్ మాట్లాడుతూ .. దర్శకుడికి ఇది తొలి చిత్రమైన ఎంతో అనుభవం ఉన్న వాళ్లలా తెరకెక్కించారని మెచ్చుకున్నారు. మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్  స్కోర్  చాలా బాగుదందని కితాబిచ్చాడు. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ లో ఉండే 17 ఓటీటీ లలో 569 వ సినిమాగా లాకెట్‌ని విడుదల చేస్తున్నామని, ఈ సినిమా చిత్రం ద్వారా టీం అందరికీ మంచి పేరు వస్తుంది అన్నారు. 

చిత్ర సమర్పకుడి గా మహేష్ పటేల్ మాట్లాడుతూ.. మనం ఇంకా  అంధ విశ్వాసాలలో ఉంటె  సొసైటీ  మీద మనకు ఏమి విశ్వాసం ఉంటుంది ? అని సమాజానికి మంచి మెసేజ్ ఇస్తూ  దర్శక నిర్మాతలు చేసిన  ఈ ప్రయత్నం చాలా బాగుంది. నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు . మంచి  కాన్సెప్ట్  తో తీసిన ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి అన్నారు. 

చిత్ర నిర్మాత ఇంద్రకంటి మురళీధర్ మాట్లాడుతూ .. తనతో 30 సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నాను . దర్శకుడు ఫణి కుమార్  అద్దేపల్లి  చెప్పిన ఒక కాన్సెప్ట్  తో కథను రెడీ  చేసుకోవడంతో నేను ఈ సినిమా నిర్మించాను . తనతో ఇంకా చాలా సినిమా లు చేసే అవకాశం ఉంది . ఈ సినిమా  ధియేటర్ రిలీజ్  రైట్స్ , ఆడియో , వీడియో  రైట్స్  అన్నీ మా దగ్గర ఉన్నాయి . త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం తప్పక  గొప్ప  విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని  అన్నారు.

మరిన్ని వార్తలు