రాజకీయాల్లో విజయ్‌.. లియో సీక్వెల్‌పై లోకేశ్ వ్యాఖ్యలు వైరల్‌

18 Feb, 2024 16:15 IST|Sakshi

లియో మూవీతో సూపర్‌ హిట్ అందుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. దళపతి విజయ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం గతేడాది దసరాకు విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే లియో హిట్ తర్వాత సూపర్ స్టార్‌ రజినీకాంత్‌తో లోకేశ్‌ ఒక సినిమా తీస్తున్నారు. 

అయితే తాజాగా లోకేశ్ కనగరాజ్‌ లియో పార్ట్‌ -2 గురించి పలు ఆసక్తి విషయాలు పంచుకున్నాడు. లియో సీక్వెల్‌ తప్పకుండా ఉంటుందని ఆయన తెలిపారు. కానీ ప్రస్తుతం హీరో విజయ్‌ ఆశయాలు వేరుగా ఉన్నాయి. ఈ విషయం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభినందించాలి కూడా.. విజయ్‌ ఒప్పుకుంటే లియో 2 తప్పకుండా వస్తుంది. అందుకు సమయం కూడా అనుకూలిస్తుందని ఆశిస్తున్నాను. విజయ్‌ ఫోన్‌ కోసం ఎదురుచూస్తూ ఉంటాను. లియో సినిమా విడుదల సమయం నుంచి సెకండాఫ్‌ పట్ల పలు వమర్శలు వచ్చాయి. అవన్నీ నేను కూడా విన్నాను. రాబోయే సినిమాల్లో ఆ తప్పులు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటాను.' లోకేష్‌ కనగరాజ్‌ అన్నారు.

విజయ్‌ ఇప్పటికే ఒప్పుకున్న 'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌' ప్రాజెక్ట్‌లో ఉన్నాడు. వెంకట్‌ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన రాజకీయ పార్టీని ప్రారంభించడంతో ఇదే చివరి చిత్రం అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో లియో సీక్వెల్‌ ఉంటుందా అనే అనుమానాలు వస్తున్నాయి. లోకేష్ కనగరాజ్‌, రజనీకాంత్‌ కాంబోలో తలైవర్‌ 171 సిద్ధం అవుతుంది.  

whatsapp channel

మరిన్ని వార్తలు