రామ్‌చరణ్‌తో సినిమా..ఆ డైరెక్టర్‌కు భారీ రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేసిన 'మైత్రీ'

9 Jun, 2021 14:30 IST|Sakshi

వరుస విజయాలతో జోరు మీదున్న డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజు త్వరలోనే టాలీవుడ్‌ స్టార్‌ హీరోతో ఓ సినిమా చేయనున్నాడట.  కార్తీ నటించిన “ఖైదీ” చిత్రంతో సూపర్‌ క్రేజ్‌ సంపాదించుకున్న ఈ యంగ్‌ డైరెక్టర్ వరుసగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రం తమిళంలో కాదు తెలుగులోనూ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ డైరెక్టర్‌తో పనిచేసేందుకు పలువురు స్టార్‌ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా తలపతి విజయ్‌తో మాస్టర్‌ చిత్రాన్ని తెరకెక్కించి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రస్తుతం ఈ డైరెక్టర్‌ ఫోకస్‌ మన తెలుగు హీరోలపై పడిందట. రంగస్థలంతో తన నట విశ్వరూపాన్ని చూపించిన రామ్‌చరణ్‌తో కనగరాజు ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుపై రామ్‌చరణ్‌ కూడా చాలా ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నట్లు సమాచారం. రామ్‌ చరణ్‌ - లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని, దీన్ని తెలుగు, తమిళ ద్విభాష చిత్రంగా తెరకెక్కిస్తారని సినీ వర్గాల్లో టాక్‌ వినిపస్తోంది. ఇక ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనున్నారట. ఇప్పటికే డైరెక్టర్‌ కనగరాజుకు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. 

చదవండి : శంకర్‌-రామ్‌చరణ్‌ సినిమా మరింత ఆలస్యం కానుందా?
Liger Movie: ఆసక్తిరేపుతున్న క్రైమాక్స్‌ సీన్‌ అప్‌డేట్‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు