ప్రేమ.. జీవితం.. పకోడీ

31 Jul, 2020 05:56 IST|Sakshi
కార్తీక్‌ బిమల్‌ రెబ్బ, సంచిత పొనాచ

కార్తీక్‌  బిమల్‌ రెబ్బ, సంచిత పొనాచ జంటగా నటించిన చిత్రం ‘లవ్‌ లైఫ్‌ అండ్‌ పకోడీ’. మధురా శ్రీధర్‌ రెడ్డి సమర్పణలో జయంత్‌ గాలి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం ట్రైలర్‌ని హీరో రానా విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘లవ్‌ లైఫ్‌ అండ్‌ పకోడీ’ టైటిల్‌ వెరైటీగా ఉంది. ట్రైలర్‌ కూడా ఆసక్తిగా ఉంది’’ అన్నారు. జయంత్‌ గాలి మాట్లాడుతూ– ‘‘ప్రేమ, పెళ్లి.. ఏ బంధమైనా తమ జీవితానికి బంధనం కాకూడదు, స్వేచ్ఛను అడ్డుకోకూడదు అనుకుంటున్నారు నేటి యువత. నేటి ట్రెండ్‌కు అద్దం పట్టే ఇలాంటి అంశాలతో తెరకెక్కిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. త్వరలో మా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాగర్‌ వైవీవీ జతిన్‌ మోహన్, సంగీతం: పవన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వెంకట సిద్ధారెడ్డి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా