వినూత్న చిత్రం '@లవ్' ..ప్రతి పాత్రకు ఓ కథ ఉంటుంది

8 Dec, 2022 08:38 IST|Sakshi

రామరాజు, సోనాక్షి వర్మ, అభి, ప్రీతి సుందర్‌ ముఖ్య తారలుగా, శ్రీ నారాయణ దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ లవ్‌స్టోరీ ‘ 2లవ్‌’. టిఎమ్మెస్‌, ప్రీతమ్‌ ఆర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఎన్‌ క్రియేషన్స్‌ బేనర్స్‌ పై మహేందర్‌ సింగ్, శైలజ తాటిచెర్ల, శ్రీనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఈ 9న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా శ్రీనారాయణ మాట్లాడుతూ– ‘‘గిరిజనుల నేపథ్యంలో తెరకెక్కిన స్వచ్ఛమైన ప్రేమకథే ఈ చిత్రం. ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ఓ కథ ఉంటుంది. ప్రతి ఎమోషన్‌ కథను నడిపిస్తుంటుంది. రక్తమాంసాలు ఉన్న పాత్రల తాలూకు జర్నీఈ సినిమాలో అద్భుతంగా ఉంటుంది’అన్నారు. 

>
మరిన్ని వార్తలు