ట్రైబల్ బ్యాక్‌డ్రాప్‌లో స్వచ్ఛమైన ప్రేమకథగా '@లవ్'

1 Dec, 2022 13:24 IST|Sakshi

డిఫరెంట్‌ కంటెంట్‌ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. హీరోతో సంబంధం లేకుండా కథలో దమ్ముంటే చాలు.. ఆ చిత్రాన్ని బ్లాక్‌ బస్టర్‌ చేస్తారు. అందుకే ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ప్రయోగాత్మక చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు  '@లవ్' అనే సినిమా కూడా అలాంటి కోవకు చెందింన సినిమానే అని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో కంటెంట్ చాలా వైవిధ్యంగా ఉందని.. మరో వినూత్న సినిమాగా నిలుస్తోందని తెలుస్తోంది. శ్రీ నారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో  ఫస్ట్ లుక్ ను   టాలెంటెడ్ డైరెక్టర్  నాగ్ అశ్విన్  లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.   గిరిజన నేపథ్యంలో  స్వచ్ఛమైన ప్రేమ కథతో  రాబోతున్న ఈ సినిమా  తనను ఎంతగానో ఆకట్టుకుందని..నాగ్ అశ్విన్  చెప్పారు.

మంచి సినిమా రావడం  లేదు అని బాధ పడేవారికి  ఈ సినిమా మంచి ఆప్షన్.  గొప్ప కథకు ఆసక్తికరమైన కథనానికి స్టార్స్ అక్కర్లేదు అని నిరూపించే  సినిమా ఇది అంటూ నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు  దర్శకుడు శ్రీ నారాయణ ప్రతిభను మెచ్చుకుంటున్నారు.

 ట్రైబల్ బ్యాక్‌డ్రాప్‌ లో రాబోతున్న ఈ చిత్రం ఓ కొత్త అనుభూతిని పంచుతుందట.  ఇక ఈ చిత్రాన్ని టీఎమ్‌ఎస్‌(TMS) బ్యానర్ తో ప్రీతమ్ ఆర్ట్స్ &ఎస్‌ఎన్‌(SN) క్రియేషన్స్ సంయుక్తంగా మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు శ్రీనారాయణ నిర్మించారు. డిసెంబర్‌లో ఈ  @లవ్  ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరిన్ని వార్తలు