సమ్మర్‌లో బ్యూటిఫుల్‌ ‘లవ్‌స్టోరీ’

23 Jan, 2021 09:32 IST|Sakshi

నాగచైతన్య తన కొత్త ‘లవ్‌స్టోరీ’ని ఏప్రిల్‌లో థియేటర్స్‌లో చూపించడానికి రెడీ అవుతున్నారట. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. నారాయణ్‌ దాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావ్‌ నిర్మించారు. మధ్యతరగతి అబ్బాయి, అమ్మాయి చుట్టూ తిరిగే ప్రేమకథా చిత్రమిది. ఇందులో చైతన్య, సాయి పల్లవి తెలంగాణ యాసలో సంభాషణలు చెప్పడం విశేషం. ఈ సినిమాను ఏప్రిల్‌ రెండో వారంలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. 

మరిన్ని వార్తలు