Love Story Movie: ‘ల‌వ్‌స్టోరి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ట్రైల‌ర్ అదిరిందిగా..

17 Oct, 2021 12:36 IST|Sakshi

నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం ల‌వ్‌స్టోరి. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గ‌త నెల‌లో(సెప్టెంబర్‌ 24) విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. కరోనా సెంకడ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అని బడా సినిమా నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి ‘వావ్‌’ అనిపించింది.

కాగా, ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. అక్టోబర్‌ 22న సాయంత్రం 6 గంటల నుంచి ప్ర‌ముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంద‌ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా ఓ స‌రికొత్త  ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసింది. సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలే ప్రధానంగా శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరి’ మూవీని రూపొందించారు. ఇందులో అణగారిన సామాజిక వర్గానికి చెందిన రేవంత్‌గా  చైతూ, పెద్దింటి అమ్మాయి మౌనిక‌గా సాయి ప‌ల్ల‌వి అద్భుతంగా న‌టించి మెప్పించారు.  

మరిన్ని వార్తలు