ఆర్మూర్‌లో ‘లవ్‌స్టోరీ’ చిత్రీక‌ర‌ణ‌

14 Oct, 2020 18:54 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్ : నాగ‌చైత‌న్య సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న తాజాచిత్రం ‘లవ్‌స్టోరీ’.  షూటింగ్ తిరిగి ప్రారంభం అయిన నేప‌థ్యంలో నిజామాబాద్‌లోని ఆర్మూర్‌లో చిత్ర యూనిట్ సంద‌డి చేసింది. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వికి సంబంధించి కొన్ని స‌న్నివేశాల‌ను ఆర్మూర్‌లోని నవసిద్ధుల గుట్ట వ‌ద్ద చిత్రీక‌రించారు. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరూ తెలంగాణ యాసలో సంభాషణలు పలకనున్నారు. ఇది వ‌ర‌కే ఫిదా సినిమాలో తెలంగాణ యూస‌తో  సాయిప‌ల్ల‌వి ఆక‌ట్టుకుంది. కరోనా బ్రేక్‌ తర్వాత ఇటీవలే చిత్రీక‌ర‌ణ‌ తిరిగి  ప్రారంభం అయ్యింది. షూటింగ్ కూడా దాదాపు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. నారాయణ్‌ దాస్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి పవన్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. (బోడకొండలో 'లవ్‌స్టోరీ' సందడి )

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు