‘లవ్‌ స్టోరీ’ విడుదలపై అనుమానాలు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

16 Jun, 2021 17:28 IST|Sakshi

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవ్‌ స్టోరీ’. నారాయణ్‌దాస్‌ కె నారంగ్, పి. రామ్మోహన్‌రావు నిర్మించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ  కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా విడుదల వాయిదా పడింది. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతూ, సాధారణ పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో ఈ నెల చివరి నుంచి 50 శాతం సిట్టింగ్‌తో థియేటర్స్  ఓపెన్ కానున్నాయని వార్తలు వస్తున్నాయి. దీంతో ‘లవ్‌స్టోరీ’ సినిమా విడుదలపై పలు వార్తలు సోసల్‌ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. థియేటర్లు ఓపెన్‌  అయిన వెంటనే ఈ సినిమాను రిలీజ్ చేస్తారా లేక మరికొన్ని రోజులు ఆగుతారా? అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలలో ఒకరైన సునీల్ నారంగ్ విడుదలపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని తెలిపారు. 'థియేటర్లలో రోజుకు 3 షోలను మాత్రమే అనుమతిస్తే, మాత్రం మా సినిమా రిలీజ్ చేయాలనీ అనుకోవట్లేదు. నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే విడుదల గురించి ఆలోచిస్తాం. జూలై రెండో వారం తర్వాత మాత్రమే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని నా అభిప్రాయం. ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తాం’.. అని సునీల్ నారంగ్ వెల్లడించారు.


చదవండి:
భార్యకు నటుడి సర్‌ప్రైజ్‌; థాంక్యూ అంటూ భావోద్వేగం
ఆ సీక్వెల్‌కు చిట్టి ఓకే చెప్పిందా?

మరిన్ని వార్తలు