ఒక్క సినిమాతో స్టార్‌డమ్.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టగలరా?

27 Feb, 2023 17:54 IST|Sakshi

కేవలం ఒక్క సినిమాతోనే తన సత్తా చాటింది. ఓకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. అటు తెలుగు.. ఇటు తమిళ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే ఇన్ని అద్భుతాలు సృష్టించింది. చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టి తక్కువ కాలంలోనే స్టార్‌డమ్​ సంపాదించుకుంది. ఒక్క సినిమాతో సౌత్‌ ఇండస్ట్రీలో స్టార్‌గా మారిపోయింది. తన అందం, అభినయంతో సినీ ప్రేక్షకులను అలరిస్తోంది.ఒక్క సినిమాతోనే ఇన్ని అద్భుతాలు సృష్టించిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె లవ్ టుడే హీరోయిన్ ఇవానా. తాజాగా ఆమె చిన్నప్పటి ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. చిన్నప్పటి ఫొటోల్లోనూ ముద్దు ముద్దుగా ఉంది హీరోయిన్​.

‘లవ్ టుడే’ సినిమాతో ఇటీవలే తెలుగు ప్రేక్షకుల పరిచయమైంది మలయాళ ముద్దుగుమ్మ ఇవానా. ఎలాంటి అంచనాలు లేకుండా తమిళనాట నవంబర్ 4న విడుదలైన ఈ చిత్రం అక్కడ భారీ విజయాన్ని సాధించింది. కేవలం ఐదు కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే.. రూ.60 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి తమిళ్‌లో చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఈ సినిమాను తెలుగులోకి ప్రముఖ నిర్మాత దిల్ రాజు టాలీవుడ్‌లో రిలీజ్ చేశారు. నవంబర్‌ 25న టాలీవుడ్‌లో విడుదలైన ఈచిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ మూవీ రూ.2.35 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

గతంలో ఓ తెలుగు ఛానల్‌తో మాట్లాడుతూ ఓ తెలుగు స్టార్‌ హీరో ఫ్యాన్‌ని అంటూ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చింది. తెలుగులో నా ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ ‍అని.. ఆయన సినిమాలను తప్పకుండా చూస్తానని తెలిపింది. కాగా.. ప్రస్తుతం ఇవానా టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ నిర్మించనున్న కొత్త ప్రాజెక్టులో నటించనున్నట్లు తెలుస్తోంది. ధోనీ ఎంటర్టైన్మెంట్ లెట్స్ గెడ్ మ్యారిడ్ సినిమాలో ఇవానా నటించనుంది. ఈ చిత్రానికి తమిళ మణి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ జనవరి 27న ప్రారంభమైంది.


 

మరిన్ని వార్తలు