ఫెఫ్సీకి లైకా ప్రొడక్షన్స్‌ భారీ విరాళం

23 Jun, 2021 12:21 IST|Sakshi
ఫెప్సీ అధ్యక్షుడు సెల్వమణికి చెక్కు అందజేస్తున్న లైకా సంస్థ ప్రతినిధులు 

తమిళసినిమా: కరోనా రెండో దశ దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి కారణంగా పరిశ్రమలు అన్ని మూతపడ్డాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమపై కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం భారీగా ఉంది. లాక్‌డౌన్‌ వళ్ల వేలాది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ కష్ట సమయంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు హీరోలతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా ముందుకు వచ్చాయి.

దక్షిణాదికి చెందిన సినీ కార్మికులను ఆదుకునేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ)కు లైకా ప్రొడక్షన్స్‌ రూ.కోటి విరాళాన్ని అందించింది. సంస్థ ప్రధాన కార్యదర్శి తమిళ కుమరన్, సంస్థ డైరక్టర్‌ రాజా సుందరం నిరుదన్, గౌరవ్‌ ఛ్చరా, సుబ్బునారాయణన్‌ స్థానిక వడపళనిలో సమాఖ్య అధ్యక్షుడు ఆర్‌.కె.సెల్వమణికి సోమవారం చెక్కును అందజేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు