లైకా ప్రొడక్షన్స్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌గా ప్రముఖ నటి

18 Jul, 2021 08:43 IST|Sakshi

చెన్నై: లైకా ప్రొడక్షన్స్‌ అధినేత సుభాస్కరన్‌ యువ నటుడు అధర్వ మురళి కథానాయకుడిగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ సంస్థ నిర్మిస్తున్న 22వ చిత్రం ఇది. రాజ్‌కిరణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎ.సర్గుణం కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నటి రాధిక శరత్‌కుమార్, ఆర్‌.కె.సురేష్, జై ప్రకాష్‌  ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. కథానాయికగా ఓ ప్రముఖ నటి నటించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.

ఈ చిత్రం శుక్రవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సహజత్వంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను తిరువయ్యారు పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేసినట్లు చెప్పారు. దీనికి జిబ్రాన్‌ సంగీతాన్ని, లోకనాథన్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు