రచయితకు చేదు అనుభవం.. వెజ్‌ మంచూరియాలో చికెన్‌ ముక్కలు! స్విగ్గీ సారీ చెప్పాల్సిందే!

18 Aug, 2022 18:59 IST|Sakshi

తమిళ పాటల రచయిత కో శేషాకు ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్యూర్‌ వెజిటేరియన్‌ అయిన ఆయన స్విగ్గీ పుణ్యామా అని మాంసం రుచి చూడాల్సి వచ్చింది. శేషా బెంగళూరులో స్టే చేశాడు. ఈక్రమంలో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ ద్వారా బుధవారం ‘గోబీ మంచూరియా విత్‌ కార్న్‌ ఫ్రైడ్‌ రైస్‌’ ఆర్డర్‌ చేశాడు. 

మాంచి ఆకలిమీదున్న ఆయన ఫుడ్‌ రాగానే ఆబగా తినేశాడు. కొద్దిగా తిన్న తర్వాత ఆయనకు ఫుడ్‌లో ఏదో తేడా అనిపించింది. అది వెజ్‌ మంచూరియా కాదని నిర్ధారణకు వచ్చి తినడం ఆపేశాడు. తనతోపాటు ఉన్న ఇద్దరు నాన్‌ వెజిటేరియన్‌ మిత్రులకు దాన్ని రుచి చూపించగా.. వాళ్లు అది చికెన్‌ మంచూరియా అని క్లారిటీ ఇచ్చారు. కంగుతిన్న శేషా స్విగ్గీ తప్పిదంపై కస్టమర్‌ కేర్‌ను సంప్రదించాడు. 
(చదవండి: బ్రెయిన్‌ పని చేయని స్థితిలో కమెడియన్‌)

అయితే, తమ పొరపాటును గుర్తించిన సదరు సంస్థ.. ఆర్డర్‌ విలువ రూ.70 వాపస్‌ చేస్తామని బదులిచ్చింది. దీంతో శేషాకు చిర్రెత్తుకొచ్చింది. తన మత విశ్వాలసాలను 70 రూపాయలకు విలువ కడతారా? అంటూ విమర్శలు గుప్పించాడు. చెత్త సర్వీస్‌ అంటూ ట్విటర్‌ వేదికగా గరం అయ్యాడు. పుట్టు వెజిటేరియన్‌ అయిన తనకు స్విగ్గీ స్టేట్‌ హెడ్‌ క్షమాణలు చెప్పాలని డిమాండ్‌ చేశాడు. అవసరమనుకుంటే డెలివరీ యాప్‌పై లీగల్‌గా కూడా వెళ్తానని శేషా చెప్పుకొచ్చాడు.

కాగా, శేషా ట్వీట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొందరు ఆన్‌లైన్‌ ఫుల్‌ డెలివరీల్లో ఇవన్నీ కామన్‌ అని అంటుండగా మరికొందరు.. స్విగ్గీ సర్వీస్‌ మునుపటిలా లేదని అంటున్నారు. ఇంకొందరు.. ఇదివరకు ఎప్పుడూ మాంసం తిననపుడు.. అది వెజ్‌ కాదు.. నాన్‌ వెజ్‌ అని ఎలా తెలిసింది? అని శేషాను ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వివాదంపై స్విగ్గీ ట్విటర్‌ వేదికగా స్పందించింది. రెస్టారెంట్‌ పార్టనర్‌ వల్లే తమ కస్టమర్‌కు ఇబ్బంది కలిగిందని, తమ సర్వీస్‌లో లోపం కాదని చెప్పింది. నిజంగా పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని.. శేషాకు వివరణ ఇస్తామని బదులిచ్చింది.
(చదవండి: విధి ఆడిన వింత నాటకం: ఇష్టమైన ఆటే ప్రాణం తీసింది!)

మరిన్ని వార్తలు