MAA Elections 2021: అధ్యక్ష బరిలోకి సడన్‌గా రాలేదు

25 Jun, 2021 10:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో అధ్యక్ష బరిలోకి సడన్‌గా రాలేదని, ఏడాదిగా గ్రౌండ్‌ వర్క్‌ చేసి వచ్చామని అన్నారు నటుడు ప్రకాశ్‌ రాజ్‌. 27 మందితో తన ప్యానల్‌ సభ్యులను ప్రకటించిన ఆయన శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీనీ కార్మికల సమస్యల పరిష్కారం కోసమే తాను అధ్యక్ష బరిలోకి దిగుతున్నానని చెప్పారు. తన ఫ్యానల్లో‌ని సభ్యులంతా స్వయం కృషితో పైకి వచ్చినవారేనని చెప్పారు. సమస్యల గురించి మాట్లాడక.. లోకల్‌, నాన్‌ లోక్‌ ఇష్యూ తెరపైకి తేవడం దారుణమన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘రెండు గ్రామాలు దత్తత తీసుకున్నప్పుడు నాన్‌ లోకల్‌ అనలేదు. తొమ్మిది నందులు తీసుకున్నప్పుడు, జాతీయ అవార్డు పొందినప్పుడు నాన్‌లోకల్‌ అనలేదు. అలాంటిది ఇప్పుడు ఎలా నాన్‌లోకల్‌ అంటున్నారు?. ఇది చాలా సంకుచితమైన మనస్తత్వం. ‘మా’ ఎంతో బలమైన అసోసియేషన్‌. ఇది కోపంతో పుట్టిన ‘సినిమా బిడ్డల’ ప్యానల్‌ కాదు. ఆవేదనతో పుట్టింది. ప్యానల్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టాలు ఎదుర్కొన్నవాళ్లే. ఇండస్ట్రీలో అనుభవం ఉన్నవాళ్లే. ఇది ఎంతో క్లిష్ట సమయం. మన గృహాన్ని ఇకపై మరింత పరిశుభ్రం చేసుకోవాలి. నేను అడిగానని కాదు.. అర్హత చూసి ఓటు వేయండి. ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రతిదానికి లెక్కలు చూపిస్తాం. మీరందరూ ఆశ్చర్యపడేలా మేము పనిచేస్తాం. ఈమేరకు ప్రతిరోజూ అందరి పెద్దలతో మేము మాట్లాడుతున్నాం. అందరూ మహానుభావులే.. అందరి ఆశయాలు ఒక్కటే. ఎలక్షన్‌ డేట్‌ ప్రకటించే వరకూ మా ప్యానల్‌లోని ఎవరూ కూడా మీడియా ముందుకు రారు’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. 
చదవండి:
MAA Elections 2021: ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ సభ్యులు వీరే

మరిన్ని వార్తలు