Maa Elections 2021: 'ఆ విషయం గురించి నేను చెప్పకూడదు..చెప్పలేను'

13 Oct, 2021 07:57 IST|Sakshi

 ఎన్నికలపై స్పందించిన 'మా' ఎలక్షన్‌ కమిషనర్‌

Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. ఎన్నికలు ముగిసినా కాంట్రవర్సరీలు, ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ప్రకాశ్‌రాజ్‌ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పలు  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో మొదటి రోజు గెలిచినవారు రెండోరోజు ఎలా ఓడిపోయారు? అనే ప్రశ్నను లేవనెత్తారు. ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని, పోస్టల్‌ బ్యాలెట్స్‌లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.చదవండి: ప్రకాశ్‌రాజ్‌ ఓడిపోవడానికి గల కారణాలు ఇవే!...

బ్యాలెట్‌ పేపర్స్‌ను ఎన్నికల అధికారి ఇంటికి తీసుకెళ్లినట్లు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ సభ్యులు ఆరోపణలు చేశారు. తాజాగా ఈ విషయం‍పై మా ఎన్నికల అధికారి కృష్ణమోషన్ స్పందించారు. యాంకర్‌ అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందన్న వ్యాఖ్యల్లో నిజం లేదని, అధికారికంగా ప్రకటించక ముందే వార్తలు ఎలా బయటకు వెళ్లాయో తెలియడం లేదన్నారు.

ఇక తాను బ్యాలెట్‌ పేపర్లను తీసుకెళ్లినట్లు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని పేర్కొన్నారు. తాను బ్యాలెట్‌ పేపర్ల తాళాలు మాత్రమే ఇంటికి తీసుకెళ్లానని, బ్యాలెట్‌ పేపర్లు కాదని స్పష్టం చేశారు.ఇక ప్రకాశ్‌రాజ్‌ రాజీనామాపై స్పందిస్తూ..అది పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయం అని, ఇది కరెక్టా కాదా అన్నది ఎలక్షన్‌ కమిషనర్‌గా తాను చెప్పకూడదు, చెప్పలేనని పేర్కొన్నారు. దీనిపై మా ప్రెసిడెంట్‌ మాత్రమే నిర్ణయం తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.చదవండి: మోహన్‌ బాబు అరగంట పాటు బూతులు తిట్టారు: బెనర్జీ

మరిన్ని వార్తలు