MAA Elections 2021: బాహుబలిలా కాదు..మదర్‌ థెరిస్సాలా రావాలి

26 Jun, 2021 22:28 IST|Sakshi

హైదరాబాద్‌: ఎన్నికలంటే మాటల వేడి, ఆరోపణలు ఇలా ఓ సంగ్రామాన్ని ఆ సన్నివేశాలు తలపిస్తుంటాయ్‌. ప్రస్తుతం ‘మా’ ఎన్నికలకు సమయం ఉండగానే ఇప్పటి నుంచే  ఈ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ‘మా’ ఎన్నికల నేపథ్యంలో తమపై వచ్చిన ఆరోపణలు.. భవిష్యత్ కార్యచరణపై ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్ శనివారం  మీడియాతో సమావేశం నిర్వహించారు. ‘ మా ’కి ఏం చేయలేదని అనడం తనకి చాలా బాధగా కలిగించిందని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, సినీ నటుడు శివ బాలాజీ అవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శివ బాలాజీ మాట్లాడుతూ.. ‘మా’ లో ఏమీ జరగలేదని మీరు అంటే తీసుకోవడానికి చాలా బాధగా ఉంది. పని చేయడానికి మాకు ఇంకా రెండు నెలలు సమయం ఉంది.. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాం. ఈ క్రమంలో మా స్నేహితుల నుంచి కూడా విరాళాలు తీసుకుని సహాయం చేస్తున్నాం. ‘మా’లోకి ఎవరైనా రావొచ్చు.. కాకపోతే వచ్చే వాళ్లు బాహుబలి లా రావొద్దు..  మదర్ థెరిస్సాలా రావాలని.... వచ్చి సర్వీస్ చేయలని అన్నారు. పనిచేసేవారికి  గుర్తింపు ఎలాగైనా వస్తుందన్నారు.

నరేష్ గారు ‘మా’లోకి నన్ను రావాలని ఆహ్వానించారు. ఆయన ప్రకారమే పోటీ చేసి గెలిచాను కూడా. నేను జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన తరువాత మొదట్లో ఇక్కడ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండేవాడిని.ఈ క్రమంలో నేను మొదటగా నేర్చుకుంది గొడవలే. ఎందుకంటే అందరివీ ఒకేలా అభిప్రాయాలు ఉండవు కదా. ప్రత్యేకంగా నేను ఈ విషయాన్నే ఎందుకు ఉదాహరణగా చెప్తున్నా అంటే... ఓటింగ్ చేసేటప్పుడు ఒక ప్యానల్‌ని గెలిపించండంటూ కోరారు. అటూ ఇటూ ఉంటే పనులు జరగవని శివ బాలాజీ తెలిపారు.

చదవండి: Kathi Mahesh: కత్తి మహేశ్‌ కంటికి తీవ్ర గాయం, ఐసీయూలో చికిత్స

మరిన్ని వార్తలు