MAA Elections 2021: 'మా' ఎన్నికలకు సర్వం సిద్ధం

9 Oct, 2021 17:04 IST|Sakshi

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లకు సర్వం సిద్ధమైంది. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో రేపు(ఆదివారం)జరగునున్న మా ఎన్నికల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మంచు విష్ణు, ప్రకాశ్‌ రాజ్‌ తమ సభ్యులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. రేపు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. షూటింగ్‌ స్పాట్‌లో బాలయ్య కాలికి గాయం!

సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదేరోజు రాత్రి 8 గంట‌లలోపు ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి.  దీంతో మా అధ్యక్షుడిగా ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది.

చదవండి: MAA Elections 2021: ‘‘మా’ ఎన్నికల పరిస్థితి చూస్తుంటే మనసుకు కష్టంగా ఉంది’’
జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయింది..ఇక బయటపెడుతున్నా: సుమ

మరిన్ని వార్తలు