'మా'ఎన్నికలు వెంటనే నిర్వహించాలి: చిరంజీవి

9 Aug, 2021 19:13 IST|Sakshi

'మా' ఎన్నికలపై తొలిసారిగా స్పం‍దించిన చిరంజీవి

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రతిసారీ ఇద్దరు మాత్రమే పోటీ పడే ఎన్నికలలో ఈసారి ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. రోజుకో ట్విస్ట్‌ బయటకు వస్తూ.. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి.

ఇటీవలె మా ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌పై నటి హేమ..ఫండ్‌ రైజ్‌ చేసిన డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నరేష్‌ మాట్లాడుతూ ఆమెకు స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేనంతగా మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి రంగంలోకి దిగారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలపై చిరంజీవి  తొలిసారిగా స్పందించారు.

ఎన్నికలు వెంటనే జరపాలని, ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా 'మా' ప్రతిష్ట దెబ్బతీస్తున్న ఎవరినీ ఉపేక్షించవద్దంటూ 'మా' క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణం రాజుకు చిరంజీవి లేఖ రాశారు. సభ్యుల బహిరంగ ప్రకటనలతో 'మా' ప్రతిష్ట మసకబారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు