MAA Elections 2021: రెండు రోజుల్లో ఎన్నికలు.. ‘మా’కు సీవీఎల్‌ షాక్‌

8 Oct, 2021 21:09 IST|Sakshi

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా)కు సీవీఎల్‌ నరసింహరావు షాక్ ఇచ్చారు. తాజాగా తాను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పరీక్ష రాయకుండానే ఫెయిల్‌ అయ్యాను. బురదలో ఉన్న వికసించడానికి నేను కమలాన్ని కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేందుకు ప్రయత్నం చేశానని, ఒకవేళ అది జరగకపోతే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పిన కొద్ది సేపటికే ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.  

చదవండి: MAA Elections 2021: ‘మా’ ఎన్నికల్లో ఓటు వేయను!: సీవీఎల్‌

ఈ మేరకు ఆయన ‘దివంగత నటులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, దర్శకుడు దాసరి నారాయణరావు.. అందరి ఆశీస్సులు ఉన్నాయి. కచ్చితంగా ఈ ఎన్నికలు హాయిగా ముగుస్తాయి. ఒకవేళ అలా ముగియకపోతే నేను మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’కి రాజీనామా చేస్తా. ఇందులో సభ్యుడిగా ఉండను. ఇలాంటి గందరగోళ, ఇబ్బందికర పరిస్థితులకి నేను దోహదం చేశాను. కాబట్టి ఇకపై ఓటు వేయను’ అని అన్నారు. ఇలా చెప్పిన కొద్దిసేపటికే ఆయన రాజీనామా చేశారు. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ సీవీఎల్‌ రాజీనామా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

చదవండి: నరేశ్‌పై శివాజీ రాజా సంచలన ఆరోపణలు, ‘మా’ వివాదాలకు అతడే కారణం

మొదట ‘మా’ అధ్యక్ష పోటీకి బరిలో దిగిన ఆయన నేమినేషన్‌ కూడా దాఖలు చేశాడు. అనంతరం పోటీ నుంచి తప్పకుంటూ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధ్యక్ష పిఠానికి ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అక్టోబరు ‘మా’ ఎన్నికలు 10న ఈ ఎన్నికలు జరగనుండగా.. 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో ఎవరూ అధ్యక్ష పీఠం దక్కించుకోన్నారోనని ఉత్కంఠ నెలకొంది. 

మరిన్ని వార్తలు