MAA Elections 2021: 'ఆఫర్లు వస్తే ఏ రాష్ట్రంలో అయినా పనిచేస్తాం'

3 Oct, 2021 19:34 IST|Sakshi
సుమన్‌(ఫైల్‌ ఫోటో)

MAA Elections 2021:మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలపై జరుగుతున్న పరిణామాలపై హీరో సుమన్‌ మాట్లాడారు. విశాఖలోని గాజువాక వాడ్కాయ్‌ కరాటే చాంపియన్ షిప్ పోటీల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమన్‌ మాట్లాడుతూ.. మా ఎన్నికల్లో స్థానిక, స్థానికేతరులు అనడం​ సరికాదని, సినీ ఆర్టిస్టులకు లోకల్‌, నాన్‌ లోకల్‌ ఉండదు అని పేర్కొన్నారు. చదవండి: MAA Elections 2021: మంచు విష్ణుకు బాలయ్య మద్ధతు

భారతదేశంలో పుట్టిన వాళ్లందరూ లోకలే. ఆఫర్లు వస్తే ఏ రాష్ట్రంలో అయినా పనిచేస్తాం. అందరం ఒక్కటే. ఎంతో మంది సీనియర్‌ ఆర్టిస్టులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూనియర్‌, సీనియర్‌ ఆర్టిస్టులకు ఓల్టేజ్‌ హోంను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం బీపీ, షుగర్‌ మందులు కొనుక్కునే స్తోమత లేని ఆర్టిస్టులు ఉన్నారు. మా ఎన్నికల్లో గెలిచిన వాళ్లు అలాంటి వాళ్లను ఆదుకునే ప్రయత్నం చేయాలి. మా ఎన్నికల్లో గెలిచిన వారు 'మా' అభివృద్ధికి కృషి చేయాలి అని సుమన్‌ అన్నారు. 'మా'ఎన్నికల్లో బిగ్‌ ట్విస్ట్‌: మేనిఫెస్టో ప్రకటించిన కాసేపటికే...

మరిన్ని వార్తలు