MAA Elections 2021: పోటీ నుంచి తప్పుకున్న జీవితా రాజశేఖర్‌, హేమ

3 Sep, 2021 17:55 IST|Sakshi

MAA Elections 2021: మూవీ అర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో అనుహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నటి హేమ, జీవితా రాజశేఖర్‌లు ఈ సారి పోటీలో నిలబడతారని అందరూ భావించారు. అయితే వారు పోటీ చేయడం లేదని, తమ ప్యానల్‌ నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకాశ్‌ రాజ్‌ వెల్లడించారు. ఆయన శుక్రవారం ‘సిని ‘మా’ బిడ్డల’ పేరుతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తాజాగా ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తన ప్యానల్‌ సభ్యుల కొత్త జాబితాతో పాటు, మెయిన్‌ సభ్యుల వివరాలు ప్రకటించారు. ఇందులో హేమ, జీవిత రాజశేఖరులు ఉండటం గమనార్హం.

చదవండి: MAA Elections: ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌లో జీవితా రాజశేఖర్‌, హేమ

ఈ మేరకు ప్రకాశ్‌ రాజ్‌ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు ఎంతో చేయాలని ఉందని, తమకు అవకాశం ఇస్తే చేసి చూపిస్తామన్నారు. ‘గతంతో నా ప్యానల్‌ సభ్యులను పరిచయం చేశాను. కానీ వారిలో కొందరూ మా ప్యానల్‌ సభ్యులు కాదు. ఈ సారి నా శ్రేయోభిలాషులు మాత్రమే’ అంటూ ప్రస్తుత ప్యానల్‌ సభ్యుల పేర్లను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సారి మహిళలకు సమాన అవకాశం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే గతంలో హేమ, జీవిత రాజశేఖర్‌లు అధ్యక్ష బరిలో ఉండబోతున్నారని అందరూ భావించారని, ఈ విషయమై తను హేమగారితో మాట్లాడానని ప్రకాశ్‌ రాజ్‌ చెప్పారు. మనందరం కలిస ఉండాలి మీరేమంటారు అని ఆమెను అడగడంతో ప్రెసిడెంట్‌గా పోటీ చేయనని హేమ చెప్పినట్లు తెలిపారు.

చదవండి: ‘మా’ ఎన్నికలు: ప్రకాశ్‌ రాజ్‌ ఆఫీసులో బిగ్‌బాస్‌ సభ్యులకు నైట్‌ పార్టీ!

‘‘మీ ఆలోచనలు నాకు నచ్చాయి. మీ ప్యానల్‌ నుంచి పోటీ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’ అని హేమ అన్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం హేమ చాలా ధైర్యవంతురాలని, గతంలో తనకు పనిచేసిన అనుభవం ఉన్నందువల్ల తమ ప్యానల్లోకి ఆమెను తీసుకున్నామన్నారు. ఇక జీవితా రాజశేఖర్‌ గారిని కూడా కలిసి రెండు గంటలకు పైగా మాట్లాడానని కూడా చెప్పారు. అంతేగాక తమ మా కార్యచరణను తన ముందు ఉంచానని, ఆ విషయాలన్ని జీవితా గారికి నచ్చాయన్నారు. దీంతో మా ప్యానల్‌లో పోటీ చేయడానికి ఆమె ఒప్పుకున్నట్లు వెల్లడించారు. అంతేకాదు రాజశేఖర్‌గారు కూడా మద్దతు ఇస్తానని చెప్పినట్లు ప్రకాశ్‌ రాజ్‌ పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు