మా’లో మ‌రో ట్విస్ట్‌.. రంగంలోకి పోలీసులు..సీసీటీవీ పుటేజ్ ఫుటేజ్‏ సీజ్

17 Oct, 2021 13:44 IST|Sakshi

MAA Elections 2021: ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌లు ముగిసి వారం రోజులు గడుస్తున్నా... వివాదం మాత్రం త‌గ్గ‌డం లేదు. మంచు విష్ణు, ప్ర‌కాశ్ రాజ్ ప్యాన‌ల్ మ‌ధ్య హోరా హోరిగా జ‌రిగిన ఈ ఎన్నిక‌ల్లో మంచు విష్ణు ప్యాన‌ల్ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. రిగ్గింగ్ చేశారని మంచు విష్ణు ప్యానల్ పై ఆరోపణలు చేశారు ప్రకాశ్‌ రాజ్. అంతేకాదు ఎన్నిక‌ల తీరుపై  అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజీనామాలు కూడా చేశారు.

ఓట్ల కౌంటింగ్‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని, ఎలక్షన్ రోజున మోహన్ బాబు, నరేష్ ఇతరులు తమపై దాడి, దౌర్జన్యం చేశారంటూ ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపించారు. ఎలక్షన్ టైం సీసీ ఫుటేజ్ కావాలంటూ ఎన్నిక‌ల అధికారి  కృష్ణ మోహన్ కు లేఖ రాశారు. కానీ  ఎన్నిక‌ల అధికారి కృష్ణమోహన్ అలా సీసీ ఫుటేజ్ ఇవ్వలేమని వెల్లడించారు. తాజాగా ఈ వివాదం కొత్త కోణం చోటు చేసుకుంది.  సీసీ ఫుటేజ్ ను మాయం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్ర‌కాశ్ రాజ్ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. తాజాగా  సీసీ ఫుటేజ్ సర్వర్ రూమ్ కు తాళం వేశారు. మ‌రి ఈ వివాదం ఎక్క‌డికి దారి తీస్తూందో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు