MAA Elections 2021: అభ్యర్థుల తుది జాబితా ప్రకటించిన కృష్ణ మోహన్‌

2 Oct, 2021 21:14 IST|Sakshi

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. బరిలో దిగుతున్న అభ్యర్థులు తమ​ నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్లు ముగిసిన రెండు రోజుల తర్వాత నిన్న(శుక్రవారం) నటుడు బండ్ల గణేశ్, నేడు  సీవీఎల్‌ నరసింహారావులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్న సంగతివ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ‘మా’ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ఖరారు చేశారు. తుది అభ్యర్థుల జాబితాను ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ తాజాగా విడుదల చేశారు.

కాగా ఈ సారి ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణులు పోటీ పడుతుండగా.. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి విష్ణు ప్యానల్‌ నుంచి బాబూ మోహన్‌, ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రాకాంత్‌ పోటీ చేస్తున్నారు. ఇక అసోసియేషన్‌లో రెండు వైస్‌ ప్రెసిండెంట్‌ పదవులకు ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి బెనర్జీ, హేమలు, విష్ణు ప్యానల్‌ నుంచి మాదాల రవి, పృథ్వీ రాజ్‌ పోటీ పడుతున్నారు. జనరల్ సెక్రటరీకి పదవికి జీవిత రాజశేఖర్, రఘుబాబు; కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు; రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణి పోటీ చేస్తున్నారు. కాగా అక్టోబర్‌ 10 ‘మా’ ఎన్నికలు జరగునున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు