MAA Elections 2021: ప్రకాశ్‌ రాజ్‌ ఆఫీసులో బిగ్‌బాస్‌ సభ్యులకు నైట్‌ పార్టీ ఆహ్వానం!

28 Aug, 2021 20:06 IST|Sakshi

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సారి అధ్యక్ష బరికి నలుగురు పోటీ పడుతుండటంతో ఎవరు అందుకోబోతున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శులు చేసుకుంటూ వివాదాలకు తెరలెపారు.  ఈ క్రమంలో ‘మా’ ఎన్నికల తేదీని మా క్రమశిక్షణ సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమ శిక్షణ కమిటీ తమ ప్రకటనలో వెల్లడించింది. దీంతో అభ్యర్థులు తమ ప్యానల్‌ సభ్యులతో ప్రచారం ముమ్మురం చేశారు. ఈ నేపథ్యంలో మా ఎన్నికలకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ప్రచారంలో భాగంగా మా సభ్యులను ప్రసన్నం చేసుకునేందుకు నైట్‌ పార్టీల జోరందుకుంది.

కాగా ఆగష్టు 29న(రేపు) నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు(శనివారం) రాత్రి తెలుగు బిగ్‌బాస్‌ 4 సీజన్ల కంటెస్టెంట్స్‌కు నైట్‌ పార్టీ ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ వాట్సప్‌ గ్రూప్‌లో నటుడు సమీర్‌ ఆహ్వాన మేసేజ్‌లు పంపినట్లు సమాచారం. అంతేగాక నాగార్జున బర్త్‌డే సందర్భంగా ప్రకాశ్‌ రాజ్‌ ఆఫీసులో జరిగే సెలబ్రెషన్స్‌కు నాలుగు సీజన్ల బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ హాజరు కావాల్సిందిగా వాట్సప్‌ గ్రూప్‌లో ఆహ్వానించినట్లు సమాచారం. కాగా ఈసారి అధ్యక్ష బరిలో ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నరసింహారావు, జీవితా రాజశేఖర్‌ హేమలు ఉన్నారు. చివరి నిమిషంలో ఎవరైనా బరిలోకి దిగుతారా? లేక ఎవరినైనా ఏకగ్రీవం చేస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు నటీనటుల సమస్యల పరిష్కారంతో పాటు, ‘మా’ నూతన భవనం ప్రధాన అజెండాగా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు