MAA Elections 2021: మహామహులను రంగంలోకి దింపనున్న విష్ణు

22 Sep, 2021 15:39 IST|Sakshi

మా ఎన్నికలకు రంగం సిద్ధం

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు వచ్చే నెల10న జరగనున్న సంగతి తెలిసిందే.  అక్టోబర్ 10వ తేదీన ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్‌ జరగనుంది. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నర్సింహరావు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ప్రకాశ్‌ రాజ్‌ తన ప్యానెల్‌ సభ్యులను ప్రకటించారు.

తాజాగా మంచు విష్ణు సైతం తన ప్యానెల్‌ సభ్యులను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. రేపు (గురువారం) ఆయన తన ప్యానెల్‌ను ప్రకటించనున్నారు. ఇప్పటికే మంచు విష్ణు ప్యానెల్‌లో బాబు మోహన్, రఘుబాబు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వైస్ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్, జనరల్ సెక్రెటరీగా రఘు బాబు ఉండనున్నట్లు సమాచారం. ప్రకాశ్‌ రాజ్ ప్యానెల్‌కు దీటుగా మంచు విష్ణు ప్యానెల్ ఉండనుంది. సినీ పరిశ్రమలోని మహామహులను విష్ణు రంగంలోకి దింపనున్నారు.

చదవండి : 'లైగర్‌' టీంకు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బాలయ్య
‘ప్రభాస్‌-పూజాహెగ్డే విభేదాల’పై నిర్మాతలు క్లారిటీ..!

మరిన్ని వార్తలు