MAA Elections 2021: ‘‘మా’ ఎన్నికల పరిస్థితి చూస్తుంటే మనసుకు కష్టంగా ఉంది’’

9 Oct, 2021 15:54 IST|Sakshi

అందరు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల సమయం దగ్గర పడింది. ఇంకా ‘మా’ ఎన్నికలు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో ఇటూ ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌, అటూ మంచు విష్ణు ప్యానల్‌ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ పోటీలో గెలిచేందుకు ఇరు ప్యానల్‌ సభ్యులు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ‘మా’ సభ్యులను ఆకట్టుకునేందుకు ఏ అవకాశాన్ని ఒదులుకోవడం లేదు. మరోవైపు తన కుమారుడిని గెలిపించేందుకు మోహన్‌ బాబు కూడా తనవంతు కృషి చేస్తున్నారు.

చదవండి: MAA Elections 2021: ‘మా’ గొడవ మాదే 

విష్ణుకే ఓటు వేయాలంటూ ఇప్పటికే ఆయన బహిరంగ లేఖ రాయగా.. తాజాగా ‘మా’ సభ్యులకు ఓ వాయిస్‌ మెసెజ్‌ పంపారు. ‘తెలుగు వాళ్లు ఒకటిగా ఉండాలనే ‘మా’ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ‘మా’ ఎన్నికల పరిస్థితి చూస్తుంటే మనసుకు కష్టంగా ఉంది. అసలు ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని పెద్దలు అనేవారు. అయితే కొంతమంది సభ్యులు రోడ్డనపడి నవ్వుపాలవుతున్నారు. ఎవరు ఏం చేసినా ‘మా’ అనేది ఒక కుటుంబం. విష్ణు గెలిచాక రెండు రాష్ట్రాల సీఎంలను కలుస్తాం. సినీ పరిశ్రమ కష్టాలను వారికి చెప్పుకుందాం. మేనిఫెస్టోలోని హామీలను విష్ణు నెరవేరుస్తాడనే నమ్మకం ఉంది. విష్ణు మీ కుటుంబ సభ్యుడు. ఓటు వేసే ముందు మనస్సాక్షితో ఆలోచించి ఓటు వేయండి’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. 

చదవండి: విష్ణు ప్యానల్‌కే ఓటు వేయాలంటూ మోహన్‌ బాబు లేఖ

మరిన్ని వార్తలు