MAA Elections 2021: ‘అందుకే ఎన్నికల అధికారి విష్ణు ప్యానల్‌కు ఫెవర్‌గా ఉంది’

9 Oct, 2021 20:37 IST|Sakshi

‘మా’ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌పై అనుమానాలు ఉన్నాయి: మెగా బ్రదర్‌

మాకు కొత్త ఎన్నికల అధికారి కావాలి: నాగబాబు

‘ఇందులో నిజం లేదని విష్ణు ప్యానల్‌ను రుజువు చేసుకోమనండి’

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. బరిలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరూ విమర్శలు గుప్పించుకుంటూ, వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడంతో ఈసారి మా ఎన్నికలు సాధారణ ఎన్నికలనను తలపిస్తున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా మెగా బ్రదర్‌ నాగబాబు సాక్షి టీవీతో మాట్లాడారు.  ఈ సందర్భంగా నాగబాబు విష్ణు ప్యానల్‌, మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు నాగాబాబు మాట్లాడుతూ.. ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌పై తనకు చాలా అనుమానాలు ఉన్నాయని, అతడి ఆధ్వర్యంలో ఎలక్షన్స్‌ నిర్వహణపై తనకు పలు అనుమానాలు ఉన్నాయన్నారు.

ఆయన మోహన్‌ బాబుకు దూరపు బంధువు అవుతారనే సమాచారం తమకు వచ్చిందని, అందుకే అతడు విష్ణుకు ఫేవర్‌గా ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక తమకు కొత్త ఎన్నికల అధికారి కావాలని పేర్కొన్నారు. అంతేగాక మాలో పొస్టల్‌ బ్యాలెట్‌ లేదని, మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ పెట్టాలని విష్ణు ప్యానల్‌ ప్రతిపాదనను చేసినప్పుడు తమకు కూడా సహెతుకంగా అనిపించి ఒకే అన్నామన్నారు. అయితే పోస్టల్‌ బ్యాలెట్‌ను స్కాంలా ఉపయోగించి దాని ద్వారా సభ్యులను ప్రభావితం చేస్తారని ప్రకాశ్‌ రాజ్‌ పసిగట్టి ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే మొదటి నుంచి ప్రకాశ్‌ ప్యానల్‌కు మద్దతు ఇస్తున్న నాగబాబు విష్ణు, విష్ణు ప్యానల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంకా ఏయే విషయాలు వెల్లడించారో తెలియాలండే ఆయన సాక్షి టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్య్వూ కోసం ఇక్కడ ఓ లుక్కేయండి. 

మరిన్ని వార్తలు