విష్ణు ప్యానల్‌లో వివాదాస్పద వ్యక్తులెవరూ లేరు: నరేష్

23 Sep, 2021 15:49 IST|Sakshi

Naresh Extends Support to Manchu Vishnu Pannel: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు ప్యానల్‌కు మా మాజీ అధ్యక్షుడు నరేష్‌ మద్దతు ప్రకటించారు. విష్ణు ప్యానల్‌లో వివాదాస్పద వ్యక్తులెవరూ లేరని, ఆయన ప్యానెల్‌ కొత్తగా ఉందని అభిప్రాయపడ్డారు. విష్ణు ప్యానల్‌లో ఉన్నవాళ్లు చాలా చదువుకున్నవాళ్లు, మంచివాళ్లు, అనుభవజ్ఞులున్నారని, ప్యానల్‌లో 10 మంది మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. విష్ణు తన ప్యానల్‌లో స్థానికులకు పెద్దపీట వేశాడని కొనియాడారు.

కాగా ‘మా కోసం మనమందరం’ పేరుతో మంచు విష్ణు తన ప్యానల్‌ సభ్యులను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉపాధ్యక్షులుగా మాదల రవి, పృథ్వీరాజ్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబుమోహన్, ట్రెజరర్‌గా శివబాలాజీ, జాయింట్ సెక్రటరీలుగా కరాటే కల్యాణి, గౌతమ్‌ రాజు సహా మొత్తం ప్యానల్‌ సభ్యులను విష్ణు ప్రకటించాడు. 

చదవండి : MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్‌ ఇదే

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు