Maa Elections 2021: కొత్త అసిసోయేషన్‌పై ప్రకాశ్‌రాజ్‌ క్లారిటీ..

12 Oct, 2021 18:21 IST|Sakshi

Prakash Raj Clarity On New Association : మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు టాలీవుడ్‌ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన ప్యానల్‌ నుంచి గెలిచిన 11మంది కలిసికట్టుగా రాజీనామా చేస్తున్నాం' అని ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మా అసోసియేషన్‌కు పోటీగా మరో అసోసియేషన్‌ పెడుతున్నారంటూ ఊహాగానాలు తెరమీదకి వచ్చాయి. చదవండి: మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌

'ఆల్‌ తెలుగు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(ATMAA)'పేరుతో కొత్త అసోసియేషన్‌ ప్రకటించనున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. తాజాగా ఈ రూమర్స్‌పై ‍ప్రకాశ్‌ రాజ్‌ స్పందించారు. కొత్త కుంపటి పెట్టబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన స్పష్టం చేశారు. చదవండి: ప్రకాశ్‌రాజ్‌ ఓడిపోవడానికి గల కారణాలు ఇవే!...

మరిన్ని వార్తలు