MAA Elections 2021: ఈ కారణాల వల్లే ప్రకాశ్‌రాజ్‌ ఓడిపోయాడా?

12 Oct, 2021 15:26 IST|Sakshi

గత రెండు మూడు నెలలుగా తీవ్ర ఉత్కంఠను రేపిన మా ఎన్నికలు ముగిశాయి. హోరాహోరీగా సాగిన పోరులో మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రకాశ్‌రాజ్‌పై 107ఓట్ల తేడాతో విష్ణు మా అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నారు. మా ఎన్నికలకు నోటిఫికేషన్‌ రాకముందే ప్రకాశ్‌రాజ్‌ తన ప్యానల్‌ సభ్యులను ప్రకటించారు. అందరి కంటే ముందుగా చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రత్యక్షంగా మెగా బ్రదర్‌ నాగబాబే ప్రకాశ్‌రాజ్‌కు క్యాంపెయిన్‌ చేశారు. అయినప్పటికీ ప్రకాశ్‌రాజ్‌ ఓడిపోవడానికి గత కారణాలు ఏంటి అని ఓసారి పరిశీలిస్తే..

► ప్రకాశ్‌రాజ్‌ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్ష బరిలో ఉన్నానని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి నాన్‌ లోకల్‌ ఇష్యూ తెరపైకి వచ్చింది. మొదట్లో ఈ విషయంపై ఆర్జీవీ వంటి సినీ ప్రముఖులు ప్రకాశ్‌రాజ్‌కు సపోర్ట్‌గా నిలబడినా.. ఆ తర్వాత మా అసోసియేషన్‌కు తెలుగు వాళ్లు కాకుండా, వేరే పరిశ్రమకు చెందిన వాళ్లు ఎలా పాలిస్తారు అంటూ వచ్చిన విమర్శలు వచ్చాయి. వీటిని తిప్పికొట్టకపోవడం  ప్రకాశ్‌రాజ్‌కు మైనస్‌కు మారింది. 
. కెరీర్‌ పరంగా ప్రకాశ్‌రాజ్‌ చాలా బిజీ ఆర్టిస్ట్‌. సంవత్సరానికి ఇతర భాషలతో కలిపి  సుమారు 7-8 సినిమాల్లో నటిస్తారు. అలాంటి బిజీ ఆర్టిస్ట్‌ మా అసోసియేషన్‌కు ఎలా సేవ చేస్తారనే వాదన తెరపైకి వచ్చింది. ఎక్కడో తమిళనాడులో ఉండి ఇక్కడి ఆర్టిస్టుల సమస్యలు పరిష్కరించేంత సమయం ఎలా కేటాయిస్తారనే కామెంట్స్‌ కూడా ఫిల్మ్‌ నగర్‌ వర్గాల్లో వినిపించాయి. 

మంచు విష్ణుకు మోహన్‌ బాబు చేసిన క్యాంపెయిన్‌ ప్రకాశ్‌రాజ్‌కు మైనస్‌ అయిందని చెప్పొచ్చు. సినీ పరిశ్రమలో ఆయనతో చాలామందికి ప్రత్యేక అనుబంధం ఉంది. మోహన్‌ బాబు చెబితే కాదనలేం అనే సినీ ప్రముఖులు కూడా ఉండటంతో ప్రకాశ్‌రాజ్‌కు ఓట్లు తగ్గాయన్నది మరో కారణంగా చెప్పుకుంటున్నారు.
చాన్నాళ్లుగా ఉన్న మా బిల్డింగ్‌ సమస్యపై దృష్టి పెట్టకపోవడం. అటు మంచు విష్ణు మా బిల్డింగ్‌ కోసం తన సొంత డబ్బులు ఖర్చుపెడతానని నమ్మకం కలిగించడం కూడా ప్ర​కాశ్‌రాజ్‌కు మైనస్‌గా మారింది. 

మా అధ్యక్షుడిగా ఎన్నికైతే చేసే కార్యక్రమాలు, సంక్షేమం వంటి వాటిపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టకపోవడం.. మంచు విష్ణు తర్వాత కూడా ఎలాంటి మ్యానిఫెస్టో ప్రకటించకపోవడం అతి పెద్ద మైనస్‌ అని టాక్‌ వినిపిస్తుంది.
 నాగబాబు మినహా మెగా ఫ్యామిలీ నుంచి ప్రత్యక్షంగా ఎవరూ మద్ధుతు ప్రకటించకపోవడం

ఎన్నికలకు రెండు రోజులు ముందు నాకు పెద్దల మద్దతు అవసరం లేదు అంటూ ప్రకాశ్‌రాజ్‌ చేసిన కామెంట్స్‌ నెగిటివిటిని పెంచేశాయి. ఇండస్ట్రీ పెద్దల ఆశీర్వాదం అవసరం లేదంటూ ప్రకాశ్‌రాజ్‌ తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు ఆయనకే బెడిసి కొట్టిందనే చెప్పాలి. 
ఇతర రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులను మా ఎన్నికల్లో ఓటేసేందుకు సిద్ధం చేయకపోవడం. ఎలక్షన్స్‌ రోజు ముంబై, బెంగుళూరు, ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మరీ కొందరు వేసిన ఓట్లు మంచు విష్ణుకు అనుకూలంగా మారాయి.

చదవండి: 'మా' ఎన్నికల్లో గెలుపొందిన మొత్తం సభ్యులు వీళ్లే..
నాగబాబు, ప్రకాశ్‌రాజ్‌ రాజీనామాలను ఆమోదించను: మంచు విష్ణు

మరిన్ని వార్తలు