పొలిమేరలో...

19 Feb, 2023 03:03 IST|Sakshi

సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను, బాలాదిత్య, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్‌ ముఖ్య పాత్రల్లో ఓ చిత్రం రూ΄పొందింది. ‘మా ఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డా. అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

పల్లెటూరి నేపథ్యంలో, ఊరి పొలిమేర చుట్టూ సాగే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: గ్యాని, కెమెరా: ఖుషేందర్‌ రమేష్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎ న్ .సి. సతీష్‌ కుమార్‌.

మరిన్ని వార్తలు