Manchua Vishnu: ‘మా’ సభ్యుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న మంచు విష్ణు

24 Nov, 2021 12:19 IST|Sakshi

MAA Members to Receive Corporate Health Care: MAA President Manchu Vishnu: పోటా పోటీగా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో నటుడు మంచు విష్ణు విజయం సాధించి ‘మా’ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన ఆనందరం తొలి కర్తవ్యంగా ‘మా’లో మహిళల భద్రత, సాధికారతను పెంపొందించే దిశగా విష్ణు అడుగులు వేస్తూ ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్‌ ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉంటారని వెల్లడించారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడ్డారు.

చదవండి: షాకింగ్‌ లుక్‌లో సహజనటి జయసుధ.. ఇంతగా మారిపోయారేంటి?

ఈ నేపథ్యంలో తమ ప్రధాన ఎజెండాల్లో ఒక్కటైన సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించినట్లు విష్ణు పెర్కొన్నారు. మంగళవారం మీడియాతో ముచ్చటించిన విష్ణు సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. ఇందుకోసం మా సభ్యుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు నగరంలోని ఏఐజీ, అపోలో, కిమ్స్, మెడికవర్, సన్ షైన్ ఆస్పత్రులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఈ ఆస్పత్రుల్లో 50 శాతం రాయితీపై ఓపీ కన్సల్టేషనల్‌తో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు చెప్పారు.

చదవండి: ప్రతీకార కథాంశంతో కొరటాల, ఎన్టీఆర్‌ చిత్రం

అలాగే నిరంతరం సభ్యులు తమ ఆరోగ్యాన్ని ఈ ఆస్పత్రుల్లో ఉచితంగా పరీక్షించుకోవచ్చని వెల్లడించారు. అంతేకాకుండా వైద్యనిపుణులతో ముఖాముఖీ మాట్లాడటంతో పాటు వీడియో కన్సల్టెంట్‌ ద్వారా కూడా సంప్రదించవచ్చని సూచించారు. అసోసియేషన్‌లో ఉన్న సభ్యులందరికీ దశల వారీగా ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్‌లో మెడికవర్, మార్చిలో ఏఐజీ, జూన్‌లో అపోలో, సెప్టెంబర్‌లో కిమ్స్ ఆస్పత్రిలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంచు విష్ణు తెలిపారు. అలాగే టెనెట్ డయాగ్నస్టిక్ సెంటర్‌లోనూ మా సభ్యులకు రాయితీపై రోగ నిర్దారణ పరీక్షలు చేయించనున్నట్లు విష్ణు వెల్లడించారు.

మరిన్ని వార్తలు