Maanas: మరికాసేపట్లో పెళ్లి.. హల్దీ ఫంక్షన్‌లో కాబోయే భార్యతో స్టెప్పులేసిన మానస్‌

22 Nov, 2023 15:37 IST|Sakshi

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, నటుడు మానస్‌ బ్యాచిలర్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టబోతున్నాడు. పెద్దలు కుదిర్చిన వివాహానికి పచ్చజెండా ఊపిన ఇతడు ఇటీవలే ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నాడు. నేడు (నవంబర్‌ 22న) రాత్రి 8.55 గంటలకు శ్రీజతో ఏడడుగులు వేయనున్నాడు. వీరి వివాహం విజయవాడలో జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.

ప్రస్తుతం మానస్‌ హల్దీ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వధూవరులిద్దరూ ఒకరి మీద ఒకరు నీళ్లు గుమ్మరించుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌లో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు హమీదా, శుభశ్రీ రాయగురు, తేజ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. మానస్‌- శ్రీజ హల్దీ వేడుకల అనంతరం కలిసి సంతోషంగా స్టెప్పులేశారు.

కాగా మానస్‌ అసలు పేరు సాయి రోహిత్‌. పద్మిని- వెంకటరావు నాగులపల్లిల ఏకైక సంతానం. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేసిన ఇతడు బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌తో పాపులర్‌ అయ్యాడు. ప్రస్తుతం సీరియల్స్‌ చేస్తున్న ఇతడు ఆ మధ్య మాన్షన్‌ 24 అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించాడు. 

A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru)

A post shared by Tasty Teja (@tastyteja)

చదవండి: పేరు కూడా అడగలేదు, గదిలోకి రమ్మని పిలిచాడు.. రోజూ తాగి వచ్చి టార్చర్‌..

మరిన్ని వార్తలు