సంజయ్‌ దత్‌ ఆరోగ్యంపై స్పందించిన మాన్యత

12 Aug, 2020 15:02 IST|Sakshi

ముంబై : బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం గురించి సోషల్‌ మీడియాలో రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంజూ ఆరోగ్యంపై  ఆయన భార్య మాన్యత దత్‌ స్పందించారు. సంజయ్‌ ఎప్పుడూ పోరాట యోధుడేనని, ఈ సారి కూడా విజయం ఆయనదే అవుతుందన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో అభిమానుల ప్రార్థనలు, ఆశీర్వాదాలు కావాలని ఓ ప్రకటనలో తెలిపారు.
(చదవండి : ఆకట్టుకుంటున్న సడక్‌ 2 ట్రైలర్‌)
 

‘సంజయ్‌ దత్‌ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తూ విషెస్‌ తెలిపిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ కఠిన సమయాన్ని దాటేందుకు మీ అందరి తోడు కావాలి. గతంలో కూడా ఎన్నో ఆపదన నుంచి మా కుటుంబం బయపడింది. ఈ ఇబ్బందికర పరిస్థితిని కూడా దాటేస్తాం. సంజయ్‌దత్‌ అభిమానులందరికి నా విజ్ఞప్తి ఒక్కడే.. దయచేసి పుకార్లను నమ్మకండి, వాటిని ప్రచారం చేయకండి. మీ తోడు మాకు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం’అని మాన్యత ‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ నోట్‌లోనూ సంజయ్‌ దత్‌ నిజంగానే  ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నాడా.. లేదా? అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
(చదవండి : ఆ పుకార్లు నమ్మకండి: సంజయ్‌దత్‌)

కాగా, ఊపిరి తీసుకోవడంలో కష్టంగా ఉండటం, ఛాతి నొప్పి కారణంగా సంజయ్‌ దత్‌ మంగళవారం ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఊపిరితిత్తుల కాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంజయ్‌ దత్‌ గతేడాది.. కళంక్‌, ప్రస్తానం, పానిపట్‌ చిత్రాలతో అలరించారు. తాజాగా  1991లో మహేశ్‌ బట్‌ దర్శకత్వంలో వచ్చిన హిట్‌ మూవీ సడక్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సడక్‌ 2లో నటిస్తున్నారు. ఆదిత్యారాయ్‌ కపూర్‌, ఆలియా భట్‌ ప్రధాన పాత్రలో.. పూజాభట్‌ కీలక పాత్ర పోషిస్తున్న‌ ఈ చిత్రానికి మహేశ్‌ భట్‌ దర్శకత్వం వహిస్తుండగా.. ఆయన సోదరుడు ముఖేశ్‌ భట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా