మిస్‌ రెబల్‌

27 Oct, 2022 06:34 IST|Sakshi

మేఘా ఆకాష్, రాహుల్‌ విజయ్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాటే మంత్రము’. అభిమన్యు బద్ది ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిందు ఆకాష్‌ (మేఘా ఆకాష్‌ తల్లి) సమర్పణలో ఎ. సుశాంత్‌ రెడ్డి, అభిషేక్‌ కోట నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సుశాంత్‌ రెడ్డి కథ అందించారు.

అక్టోబరు 26 మేఘా బర్త్‌ డే సందర్భంగా ‘మాటే మంత్రము’లోని ఆమె క్యారెక్టర్‌ నేమ్, లుక్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇందులో కావ్య అనే రెబల్‌ అమ్మాయిగా నటించారు మేఘా ఆకాష్‌. రెండు పాటలు మినహా షూటింగ్‌ పూర్తి చేశాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, కెమెరా: మనోజ్‌ రెడ్డి. చిత్రయూనిట్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు