మా అబ్బాయిని ఆదరించండి

5 Jul, 2022 05:40 IST|Sakshi
శిబిరాజ్, సత్యరాజ్, మామిడాల శ్రీనివాస్‌

– నటుడు సత్యరాజ్‌

‘‘నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘మాయోన్‌’ చిత్రం ద్వారా తెలుగులోకి హీరోగా పరిచయమవుతున్న నా కుమారుడు సిబి సత్యరాజ్‌ను కూడా ఆదరించాలి. ఈ సినిమా గొప్ప విజయం    సాధించాలి’’ అని నటుడు సత్యరాజ్‌ అన్నారు. కిషోర్‌ దర్శకత్వంలో సిబి సత్యరాజ్, తాన్యా రవిచంద్రన్‌ జంటగా నటించిన చిత్రం ‘మాయోన్‌’. అరుణ్‌ మోజి మాణికం నిర్మించిన ఈ తమిళ చిత్రాన్ని మూవీమ్యాక్స్‌ అధినేత మామిడాల శ్రీనివాస్‌ ఈ నెల 7న తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రం ప్రీ రిలీజ్‌లో వేడుకలో రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘నేను రాసుకున్న ‘బాహుబలి’ కథలో   కట్టప్పగా సత్యరాజ్‌ నటించడంతో తనకి, నాకు ఏదో రుణానుబంధం ఏర్పడింది. ‘మాయోన్‌’ హిట్‌    కావాలి’’ అన్నారు. ‘‘మైథలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రమిది’’అన్నారు కిషోర్‌. ‘‘మాయోన్‌’ చిత్రంలో నేను   ఆర్కియాలజిస్ట్‌గా నటించాను’’ అన్నారు హీరో శిబి సత్యరాజ్‌. ‘‘పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది’’ అన్నారు మామిడాల శ్రీనివాస్‌. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: రామ్‌ప్రసాద్‌. 

మరిన్ని వార్తలు