Maayon Movie: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన కట్టప్ప తనయుడి సినిమా, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

14 Sep, 2023 11:59 IST|Sakshi

జనాలు ఓటీటీకి విపరీతంగా అలవాటుపడిపోయారు. థియేటర్‌లో ఏయే సినిమాలు రిలీజవుతున్నాయో చూడటమే కాకుండా అటు ఓటీటీలోనూ కొత్తగా ఏం విడుదలవుతున్నాయని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. వీరి ఉత్సుకతను గమనించిన సినీమేకర్స్‌ తమ చిత్రాలను అటు థియేటర్‌లో రిలీజ్‌ చేస్తూ కొన్ని వారాల తర్వాత ఓటీటీలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఎంత పెద్ద సినిమా అయినా, చిన్న చిత్రం అయినా ఒక నెల నుంచి మూడు నెలల లోపు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోతుంది. కానీ ఓ సినిమా మాత్రం థియేటర్‌లో విడుదలైన ఏడాది తర్వాత ఓటీటీలోకి రావడం గమనార్హం.

ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా? అదే మాయోన్‌. 'కట్టప్ప' సత్యరాజ్‌ కుమారుడు సిబిరాజ్‌ ఈ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. యంగ్‌ డైరెక్టర్‌ కిషోర్‌ తెరకెక్కించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించాడు. తాన్య రవిచంద్రన్‌ హీరోయిన్‌గా నటించింది. గతేడాది జూన్‌ 24న తమిళంలో, జూలై 7న తెలుగులో విడుదలవగా మిశ్రమ స్పందన అందుకుంది. తాజాగా ఈ చిత్రం సడన్‌గా ఓటీటీలో ప్రత్యక్షమైంది. అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. థియేటర్‌లో విడుదలైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చింది.

మాయోన్‌ కథేంటంటే..
అర్జున్‌(సిబి సత్యరాజ్‌) ఆర్కియాలజిస్ట్‌. పురాతన వస్తువులను కాపాడుకోవడం మన బాధ్యత, సంస్కృతి అని అందరికీ హితబోధ చేస్తూ తాను మాత్రం విగ్రహాల స్మగ్లింగ్‌కు పాల్పడుతాడు. తన సీనియర్‌ అధికారి దేవరాజ్‌(హరీష్‌ పేరడీ)తో చేతులు కలిసి పురాతన వస్తువులను, విగ్రహాలను విదేశాలకు అమ్మెస్తుంటారు. ఈ క్రమంలో వీరికి విజయానందపురంలో ఐదు వేల సంవత్సరాల చరిత్ర గల మాయోన్‌ ఆలయం, అందులో ఉన్న నిధి గురించి తెలుస్తుంది. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటారు. అసలు మాయోన్‌ ఆలయం చరిత్ర ఏంటి? ఆ నిధిని దక్కించుకున్నారా? వీరి విగ్రహాల స్మగ్లింగ్‌కు పోలీసులు చెక్‌ పెట్టారా? లేదా? వంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా ఓటీటీలో చూసేయండి.

చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్‌, షాక్‌లో ఫ్యాన్స్‌.. అనారోగ్య సమస్యలే కారణమా?

మరిన్ని వార్తలు