Dil Raju-Nithin: ఇండస్ట్రీలో 20 ఏళ్లు.. ఇది మామూలు విషయం కాదు

11 Jul, 2022 05:24 IST|Sakshi
‘దిల్‌’ రాజు, నితిన్, కృతీశెట్టి, అంజలి, రాజశేఖర్‌ రెడ్డి, మహతి స్వర సాగర్‌

–‘దిల్‌’రాజు

‘‘జయం’(2002) సినిమాతో మొదలైన నితిన్‌ ప్రయాణం ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. ఇంత పోటీలో కూడా నితిన్‌ సక్సెస్‌ ఫుల్‌గా ఉండటం గొప్ప విషయం. ‘మాచర్ల నియోజకవర్గం’ బ్లాక్‌బస్టర్‌ అవుతుంది’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. నితిన్, కృతీశెట్టి, కేథరీన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం  ‘మాచర్ల నియోజకవర్గం’. ఎమ్‌.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 12న రిలీజ్‌ కానుంది.

మహతి స్వర సాగర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘రా రా రెడ్డి.. ఐ యామ్‌ రెడీ’ పాట లిరికల్‌ వీడియోను ‘దిల్‌’ రాజు విడుదల చేశారు. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించిన ఈ పాటను లిప్సిక ఆలపించారు. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు. పాట రిలీజ్‌ సందర్భంగా నితిన్‌ మాట్లాడుతూ– ‘‘నా అభిమానుల కోసం ఈ చిత్రంలో హెవీ డ్యాన్స్‌ నంబర్స్‌ పెట్టాం. ‘రా రా రెడ్డి..’ పాటలో నా ‘జయం’ చిత్రంలోని ‘రాను రాను అంటూనే..’ పాటను రిపీట్‌ చేయడం ప్రత్యేకంగా అనిపించింది. అంజలి కాలికి గాయమైనప్పటిMీ  ఫ్లోర్‌ మూమెంట్స్‌ని హార్డ్‌వర్క్‌తో కంప్లీట్‌ చేశారు’’ అన్నారు. ‘‘మాచర్ల నియోజకవర్గం’ సూపర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రాజశేఖర్‌ రెడ్డి.
 

మరిన్ని వార్తలు