MAD Movie:చిన్న సినిమా అయినా బాగుంటే పెద్ద సినిమా అవుతుంది

5 Aug, 2021 14:23 IST|Sakshi

MAD Movie Pre Release Event: ‘‘సినిమా విడుదల ముందు వరకే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఉంటుంది. చిన్న సినిమా అయినా  బాగుంటే పెద్ద సినిమా అవుతుంది. ‘మ్యాడ్‌’  మంచి విజయం సాధించాలి’’ అని నిర్మాత టి. రామ సత్యనారాయణ అన్నారు. మాధవ్‌ చిలుకూరి, స్పందన పల్లి, రజత్‌ రాఘవ్, శ్వేతావర్మ  ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్‌’. లక్ష్మణ్‌ మేనేని దర్శకత్వం వహించారు. టి. వేణుగోపాల్‌ రెడ్డి, బి. కృష్ణారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న రిలీజవుతోంది.

ప్రీ రిలీజ్‌ వేడుకలో లక్ష్మణ్‌ మేనేని మాట్లాడుతూ– ‘‘మ్యాడ్‌’ రెగ్యులర్‌ చిత్రంలా ఉండదు. సినిమా చూసి, బాగుంటే తోటివారికి కూడా చెప్పండి’’ అన్నారు. ‘‘మేమంతా చాలా నమ్మకంతో ‘మ్యాడ్‌’ చేశాం. మా మూవీ థియేటర్‌లో రిలీజ్‌ అవుతుండటం హ్యాపీ’’ అన్నారు మాధవ్‌ చిలుకూరి. ‘‘మా సినిమా చూడకుండా కామెంట్స్‌ పెట్టకండి.. సినిమా చూశాకే స్పందించాలని నా విన్నపం’’ అన్నారు రజత్‌ రాఘవ్‌. ‘‘కరోనా టైమ్‌లో మా చిత్రం ద్వారా ఓ 50 మందికి ఉపాధి కల్పించాననే సంతృప్తి ఉంది. ఈ సినిమా సక్సెస్‌ అయితే మరో సినిమా చేసే నమ్మకం వస్తుంది’’ అన్నారు నిర్మాత కృష్ణారెడ్డి.

మరిన్ని వార్తలు