సింగిల్‌గా ఉండు మామా.. 

15 Sep, 2023 00:20 IST|Sakshi
‘మ్యాడ్‌’ పోస్టర్‌

‘హే సింగిల్‌గా ఉండు మామా.. గాళ్‌ఫ్రెండ్‌ ఎందుకు?..హైదరాబాద్‌.. సికింద్రాబాద్‌..పొరెంటబడితే నువ్వు బరాబాత్‌’ అంటూ మొదలవుతుంది ‘మ్యాడ్‌’ చిత్రంలోని ప్రౌడ్సే బోలో ఐయామ్‌ సింగిల్‌’ పాట. నార్నే నితిన్, సంగీత్‌ శోభన్, రామ్‌ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సునీల్‌కుమార్, గోపికా ఉద్యాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఇది. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో ఎస్‌. హారిక, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం  త్వరలోనే విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమాలోని ప్రౌడ్సే బోలో ఐ యామ్‌ సింగిల్‌..’ పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు మేకర్స్‌. సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో సారథ్యంలో రఘురామ్‌ సాహిత్యం అందించారు. నకాష్‌ అజీజ్‌తో కలిసి భీమ్స్‌ సిసిరోలియో ఈ పాటను ఆలపించారు.

మరిన్ని వార్తలు