హీరో రామ్‌ మూవీలో విలన్‌గా మాధవన్‌, స్పందించిన నటుడు!

12 Jun, 2021 18:33 IST|Sakshi

తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్‌లో ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని హీరోగా ఓ మాస్‌ మసాలా చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్‌కు జోడిగా ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్‌ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం లాక్‌డౌన్‌ అనంతరం సెట్స్‌పైకి రానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మెయిన్‌ విలన్‌గా హీరో మాధవన్‌ను తీసుకోనున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది.

తాజాగా ఈ రూమార్స్‌పై మాధవన్‌ స్పందించాడు. లింగుస్వామి తెలుగు మూవీలో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంగా లేదని సోషల్‌ మీడియా వేదిక వెల్లడించాడు. మ్యాడి ట్వీట్‌ చేస్తూ.. ‘అద్భుతమైన డైరెక్టర్‌ లింగుస్వామి డైరెక్షన్‌లో నటించాలని నాకూ ఉంది. అయితే కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న తెలుగు సినిమాలో నేను విలన్‌గా నటిస్తున్నానంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. ఇది కేవలం పుకారు మాత్రమే’ అంటూ స్పష్టం చేశాడు.

మరిన్ని వార్తలు