Ranganathan Madhavan: రాకెట్రీ కోసం ఇల్లు అమ్మేసిన హీరో, మాధవన్‌ ఏమన్నాడంటే?

17 Aug, 2022 14:32 IST|Sakshi

ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం రాకెట్రీ:ది నంబి ఎఫెక్ట్‌. హీరో ఆర్‌ మాధవన్‌ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ సినిమా అందరికీ చేరువవ్వాలని ఎంతగానో తాపత్రయపడ్డాడు మ్యాడీ. అనుకున్నట్లే అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో విజయవంతంగా దూసుకుపోయి చిత్రయూనిట్‌ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. అయితే మాధవన్‌ రాకెట్రీ సినిమా బడ్జెట్‌ కోసం నిధులు సేకరించే క్రమంలో తన ఇంటినే అమ్మేశాడంటూ ఓ వార్త వైరల్‌ అవుతోంది.

నిజానికి రాకెట్రీ సినిమాకు తొలుత మాధవన్‌ దర్శకుడు కాదని, ఓ ప్రముఖ డైరెక్టర్‌ ఈ సినిమాను చేయాల్సి ఉండగా అప్పటికే చేతిలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో రాకెట్రీ నుంచి తప్పుకున్నాడని, దీంతో మ్యాడీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడరి సదరు కథనం పేర్కొంది. మరోవైపు అతడి కొడుకు వేదాంత్‌ స్విమ్మింగ్‌లో దేశం తరపున పాల్గొని బంగారు పతకాలు సాధించాడంటూ మ్యాడీ కుటుంబాన్ని కీర్తించింది. తాజాగా దీనిపై హీరో మాధవన్‌ స్పందించాడు..

'ఓరి దేవుడా.. నేనేదో గొప్ప త్యాగం చేశానని మీరు నన్ను ఆకాశానికి ఎత్తేయొద్దు. ఎందుకంటే నేను నా ఇల్లే కాదు, దేన్నీ కోల్పోలేదు. దేవుడి దయ వల్ల రాకెట్రీ సినిమాలో పాలుపంచుకున్న అందరూ ఈ ఏడాది ఎక్కువ ఆదాయపన్ను చెల్లించనున్నారు. అంత గొప్పగా, గర్వించదగ్గ లాభాలు వచ్చాయి. నేను ఇప్పటికీ నా ఇంటిని ప్రేమిస్తున్నాను, అదే ఇంట్లో నివసిస్తున్నాను కూడా!' అని ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చాడు మ్యాడీ.

చదవండి: రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్‌
ఈ రెండు చిత్రాలకు సీక్వెల్‌ తీసే ధ్యైర్యం చేస్తారా?

మరిన్ని వార్తలు