మ్యాడీ షో స్పాయిలర్‌, ఛీ నిరుత్సాహపరిచాడు..

12 Jan, 2021 17:27 IST|Sakshi

హీరో మాధవన్‌ (మ్యాడీ) తాజా చిత్రం ‘మారా’ ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైంలో విడుదలైన సంగతి తెలిసిందే. మాలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన రోమాంటిక​ డ్రామా ‘చార్లీ’ని దర్శకుడు దిలీప్‌ కుమార్‌ తమిళంలో ‘మారా’ పేరుతో తెరకెక్కించాడు. జనవరి 8న అమెజాన్‌ ప్రైంలో విడుదలైన ఈ సినిమాపై మూడుకు పైగా రేటింగ్‌తో పాజిటివ్‌ రెస్పాన్స్‌ అందుకోగా తాజాగా ఓ అభిమాని మాత్రం మ్యాడీపై విమర్శలు గుప్పించాడు. ఇక అది చూసి మ్యాడీ ఇచ్చిన సమాధానం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ‘మారా బిలో యావరేజ్ మూవీ. చార్లీ సినిమా మొదటి 30 నిమిషాల తర్వాత కూడా ప్రేక్షకులు చాలా ఇబ్బంది పడి ఉంటారు. నిజంగా మాధవన్‌ షో స్పాయిలర్‌, అంతగా ఆయన పాత్ర నిరుత్సాహపరిచింది’ అంటూ ట్వీట్‌ చేశాడు. (చదవండి: నెటిజన్‌కు రివర్స్‌ కౌంటరిచ్చిన హీరో)

ఇక దీనికి మాధవన్‌ ‘హో మిమ్మల్ని నిరుత్సాహపరిచినందకు క్షమిచండి. మరోసారి ఈ తప్పు జరకుండా చూసుకుంటా. తదుపరి సినిమాలో మంచి ప్రదర్శన ఇస్తాను’ అంటూ చేతులు జోడించిన ఏమోజీతో సమాధానం ఇచ్చాడు. అయితే మలయాళంలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ‘చార్లీ’ని డైరెక్టర్‌ దిలీప్‌ కుమార్‌ ‘మారా’ పేరుతో తమిళంలో రీమేక్‌ చేశాడు. చార్లీలో హీరో దుల్కర్‌ సల్మాన్‌, పార్వతీలు లీడ్‌రోల్‌లు పోషించగా మారాలో మాధవన్, ‌శ్రద్దా శ్రీనాథ్‌ నటించారు. కాగా ఓటీటీలో విడుదలైన మారా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇందులో మ్యాడీ పాత్ర చాలా అద్బుతంగా ఉందని, మాధవన్‌ తన నటనతో ‘మారా’కు జీవం పోశాడంటూ సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేగాక ఇందులోని పలు సన్నివేశాల్లో మ్యాడీ ఎనర్జీటిక్‌, ఉల్లాసవంతమైన నటనతో హైలెట్‌గా నిలిచాడాని ప్రశంసిస్తున్నారు. ఇక మౌలీ, షీవాద నాయర్‌, అభిరామీ, అలెగ్జాండర్‌ బాబులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. (చదవండి: రతన్‌ టాటా బయోపిక్‌..‌ అది నేను కాదు..)

మరిన్ని వార్తలు